AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: మహిళలు రోజులో 2 గంటలు కేటాయిస్తే చాలు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇప్పుడివే ట్రెండింగ్

మహిళలకు.. మరీ ముఖ్యంగా గృహిణులు తమ ప్రతిభను, అభిరుచులను ఆదాయ వనరులుగా మార్చుకునేందుకు అనేక మార్గాలున్నాయి. తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే ఈ వ్యాపారాలు స్టార్ట్ చేస్తే.. మంచి లాభాలు సంపాదించవచ్చు. ఈ వ్యాపారావకాశాలతో మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించవచ్చు.

Business Ideas: మహిళలు రోజులో 2 గంటలు కేటాయిస్తే చాలు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇప్పుడివే ట్రెండింగ్
Business Ideas
Ravi Kiran
|

Updated on: Feb 20, 2026 | 8:35 AM

Share

ఈ మధ్యకాలంలో చాలామంది ఉద్యోగులకు బదులుగా సొంతంగా స్టార్టప్ లేదా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇంటి నుంచే బిజినెస్‌లు స్టార్ట్ చేసి.. తమ ప్రతిభను చాటి చెప్పాలని అనుకుంటున్నారు మహిళలు. మరి వాళ్ల కోసం తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని అందించే బిజినెస్ ఐడియాస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఇంటి నుంచే ప్రారంభించే ఆ వ్యాపారాలు ఏంటంటే..

1. హోమ్ ఫుడ్ అండ్ టిఫిన్ సెంటర్:

ఈ వ్యాపారానికి సుమారు రూ. 5 వేల నుంచి రూ. 20 వేల వరకు పెట్టుబడి అవసరం కావచ్చు. ఇంట్లోనే రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని, టిఫిన్లను తయారు చేసి విక్రయించవచ్చు. సోషల్ మీడియా ద్వారా మీ వంటకాల ప్రత్యేకతను వివరించి మార్కెటింగ్ చేసుకోవచ్చు. జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్‌లతో కలిస్తే ఆన్‌లైన్‌లో కూడా డెలివరీ సేవలను అందించవచ్చు.

2. హ్యాండీక్రాఫ్ట్స్ తయారీ:

రూ. 5 వేల నుంచి రూ. 15 వేల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీకు పాత వస్తువులతో అలంకరణ వస్తువులు, జ్యువెలరీ, కొవ్వొత్తులు, సబ్బులు లేదా పెయింటింగ్స్ తయారుచేసే నైపుణ్యం ఉంటే, దాన్ని ఒక విజయవంతమైన వ్యాపారంగా మార్చుకోవచ్చు. మీ ఉత్పత్తులను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా మార్కెటింగ్ చేసుకోవచ్చు.

3. ఆన్‌లైన్ ట్యూటరింగ్ లేదా కోచింగ్:

ఆన్‌లైన్ లెర్నింగ్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఇది ఒక లాభదాయకమైన వ్యాపారం. స్కూల్ సబ్జెక్టులు, సంగీతం, విదేశీ భాషలు, నైపుణ్య ఆధారిత కోర్సులు లేదా మోటివేషనల్ అంశాలపై ట్యూషన్ చెప్పవచ్చు. దీనికి సుమారు రూ. 25 వేల వరకు పెట్టుబడి అవసరం కావచ్చు. మంచి కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్, వెబ్‌క్యామ్, టీచింగ్ కిట్స్ అవసరం. మీరు చెప్పే అంశాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు.

4. వ్లాగింగ్, ఫ్రీలాన్స్ రైటింగ్:

రూ. 2 వేల నుంచి రూ. 8 వేల పెట్టుబడితో దీన్ని ప్రారంభించవచ్చు. పేరెంటింగ్ సలహాలు, ఫుడ్ వ్లాగ్స్, లైఫ్‌స్టైల్ లాంటి అనేక విషయాలపై కంటెంట్‌ను అందించవచ్చు. కొత్త విశేషాలు, ఆసక్తికరమైన అంశాలపై ఇంట్లోనే వీడియోలు తయారు చేసి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు.

5. డేకేర్ సెంటర్లు:

రూ. 10 వేల నుంచి రూ. 30 వేల పెట్టుబడితో డేకేర్ సెంటర్లను ప్రారంభించవచ్చు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నందున, తమ పిల్లలను సురక్షితంగా చూసుకునే డేకేర్‌ల కోసం వెతుకుతున్నారు. పిల్లల కోసం ఒక ప్లే రూమ్ ఏర్పాటు చేసి, వారి భద్రతకు భరోసా ఇస్తే, ఇది మంచి ఆదాయ వనరుగా మారుతుంది.

6. బ్యూటీ అండ్ లెర్నింగ్ సర్వీసులు:

బొటిక్, టైలరింగ్, ఈవెంట్ ప్లానింగ్, ఆన్‌లైన్ రీసెల్లింగ్ లాంటి వ్యాపారాలను కూడా తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారాలకు సంబంధించిన మెలుకువలు నేర్చుకోవడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. మహిళలు వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రభుత్వం నుంచి కూడా చాలా సహాయం లభిస్తుంది. ముద్ర యోజన, స్టాండప్ ఇండియా, సిడ్‌బిఐ(SIDBI) ప్రోగ్రామ్ లాంటి పథకాల కింద ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని మహిళలు తమ ఇంటి నుంచే వ్యాపారవేత్తలుగా మారవచ్చు.

Follow Us