AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: జస్ట్.. 2 గంటల్లోనే హైదరాబాద్ టు విజయవాడ.. కేంద్రం నిర్ణయంతో ఆ కష్టాలకు చెక్..

హైదరాబాద్ టు విజయవాడ.. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం అంటే ఒకప్పుడు గంటల కొద్దీ సాగే విసుగు, ట్రాఫిక్ నరకం. కానీ త్వరలోనే ఆ కష్టాలన్నీ మాయం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల రవాణా ముఖచిత్రాన్ని మార్చేస్తూ, NH-65 హైవేపై సుమారు రూ.10వేల కోట్లతో భారీ వ్యయంతో ఆరు లైన్ల విస్తరణ పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

Telangana: జస్ట్.. 2 గంటల్లోనే హైదరాబాద్ టు విజయవాడ.. కేంద్రం నిర్ణయంతో ఆ కష్టాలకు చెక్..
Hyderabad To Vijayawada In 2 Hours
Krishna S
|

Updated on: Feb 20, 2026 | 8:01 AM

Share

తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా ముఖచిత్రాన్ని మార్చేసే కీలక అడుగు పడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను అనుసంధానించే అత్యంత రద్దీ కలిగిన జాతీయ రహదారి 65 విస్తరణకు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న నాలుగు లైన్ల రహదారిని ఆరు లైన్లుగా మారుస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఈ మెగా ప్రాజెక్ట్ రెండు నగరాల మధ్య ప్రయాణాన్ని తగ్గించనుంది. హైదరాబాద్ నుండి విజయవాడ వరకు 231 కిలోమీటర్ల పొడవుగల ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.10,391 కోట్లు కాగా మొత్తం కేంద్రమే భరించనుంది. ప్రస్తుతం 4.5 నుంచి 5 గంటలు పడుతుండగా, విస్తరణ తర్వాత కేవలం 2.5 నుండి 3 గంటల్లోనే చేరుకోవచ్చు. ప్రతిరోజూ సుమారు 60,000 నుండి 80,000 వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తాయి.

ఏం మారబోతోంది?

ఈ విస్తరణ కేవలం రోడ్డు వెడల్పు చేయడం మాత్రమే కాదు ప్రయాణాన్ని అత్యంత సురక్షితంగా మరియు వేగంగా మార్చేలా ప్రణాళికలు రచించారు. నల్గొండ, సూర్యాపేట, కోదాడ, నందిగామ వంటి ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యను నివారించడానికి కొత్త బైపాస్‌లను నిర్మిస్తున్నారు. స్థానిక వాహనాల వల్ల ప్రధాన హైవేపై రద్దీ పెరగకుండా దాదాపు అన్ని విభాగాల్లో సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. పాదచారులు, స్థానిక వాహనాలు రోడ్డు దాటేటప్పుడు ప్రమాదాలు జరగకుండా కీలక జంక్షన్ల వద్ద అండర్ పాస్‌లను ప్లాన్ చేశారు.

విమానం కంటే వేగంగా..

సాధారణంగా హైదరాబాద్ నుండి విజయవాడకు విమానంలో వెళ్లడానికి ఒక గంట పడుతుంది. కానీ ఎయిర్‌పోర్టుకు వెళ్లడం, చెక్-ఇన్ ప్రాసెస్ కలిపితే మొత్తం 4 గంటలు పడుతుంది. ఇక మీదట ఈ 6 లైన్ల రహదారి అందుబాటులోకి వస్తే.. మీ ఇంటి నుండి కారులో బయలుదేరి 2.5 గంటల్లో విజయవాడ చేరుకోవచ్చు. ఇది విమాన ప్రయాణం కంటే తక్కువ ఖర్చుతో కూడిన వేగవంతమైన ప్రత్యామ్నాయంగా మారనుంది.

రాజకీయ ప్రాధాన్యత

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సంప్రదింపులు జరుపుతూ, పనులను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం తన ముద్ర వేయాలని చూస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్రా మూలాలున్న ప్రజలకు ఈ హైవే ఒక ఎమోషనల్ లింక్. దీని నిర్మాణం పూర్తయితే రాజకీయంగా కూడా కాంగ్రెస్‌కు పెద్ద అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది.

డీపీఆర్ రెడీ

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే డీపీఆర్ పూర్తి చేసింది. టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉంది. పనులు ప్రారంభమైన తర్వాత రెండు సంవత్సరాల కాల పరిమితిలో దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మాణ సమయంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా పక్కా ప్లానింగ్‌తో అధికారులు ముందుకు వెళ్తున్నారు.

Follow Us
అరటిపండు Vs ఖర్జూరం.. రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
అరటిపండు Vs ఖర్జూరం.. రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
పీఎం కిసాన్ విడుదల వేళ కేంద్రం అలర్ట్.. రైతుల ఫోన్లకు మెస్సేజ్
పీఎం కిసాన్ విడుదల వేళ కేంద్రం అలర్ట్.. రైతుల ఫోన్లకు మెస్సేజ్
JEE Main 2026 దరఖాస్తుకు మళ్లీ తెరచుకున్న అప్లికేషన్లు..లింక్ ఇదే
JEE Main 2026 దరఖాస్తుకు మళ్లీ తెరచుకున్న అప్లికేషన్లు..లింక్ ఇదే
కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు పండగే..
కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు పండగే..
అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే..
అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే..
Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్..
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..