- Telugu News Photo Gallery World photos Know irctc train journey all rules of train journey including dustbin use poster wrong coach journey
టికెట్టు లేకపోవడం.. చైన్ లాగడం మాత్రమే కాదు.. రైలులో ఈ పని చేసినా బారీగా జరిమానా విధిస్తారు.. ఏంటో తెలుసా..
సాధారణంగా మనం రైలులో టికెట్టు లేకుండా ప్రయాణిస్తే జరిమాన విధిస్తారు. అలాగే కారణం లేకుండా చైన్ లాగినప్పుడు కూడా జరిమాన విధిస్తారు. కానీ కొన్ని పనులు చేసినప్పుడు కూడా జరిమాన విధిస్తారు.
Updated on: Feb 23, 2022 | 9:27 PM

రైలులో ప్రయాణించినప్పుడు చైన్ లాగినా.. టికెట్టు లేకుండా ప్రయాణం చేసిన నేరంగా పరిగణించబడుతుంది. ఇందుకు జరిమానా కూడా వేస్తారు. అయితే కొన్నిసార్లు ఈ పోరపాట్లు చేసిన కానీ జరిమానా విధిస్తారు. అదెంటో తెలుసుకుందామా.

రైలు పైనకు ఎక్కడం.. గేటుపై ప్రయాణించడం కూడా రైల్వే చట్టంలోని సెక్షన్ 156 ప్రకారం నేరం. అలా ప్రయాణిస్తే రూ. 500 జరిమానాతోపాటు 3 నెలల జైలు శిక్ష విధించబడుతుంది.

అలాగే రైలులో చెత్త వేసిన కూడా నేరమే. రైల్వే చట్టంలోని సెక్షన్ 145 (బి) ప్రకారం మొదటిసారి చెత్త వేస్తే రూ. 100 జరిమానా విధిస్తారు. అలాగే రెండోసారి చెత్త వెస్తే రూ. 250 జరిమానా లేదా ఒక నెల జైలు శిక్ష ఉంటుంది.

రైలులో పోస్టర్ అతికించడం కూడా నేరమే. రైల్వే చట్టంలోని సెక్షన్ 166 (బి ) ప్రకారం రైలులో పోస్టర్ అతికించిన వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధిస్తారు.

రైలులో పోస్టర్ అతికించడం కూడా నేరమే. రైల్వే చట్టంలోని సెక్షన్ 166 (బి ) ప్రకారం రైలులో పోస్టర్ అతికించిన వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధిస్తారు.




