మన దేశంలో కిందటేడాది నిరుద్యోగం రేటు దాదాపు 8 శాతం. అంటే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు చాలామంది ఉన్నారని అర్థం. కానీ ఉద్యోగాలే సరిపడా లేవు. అందులోనూ భారీ జీతాలు, విలాసవంతమైన సౌకర్యాలూ, ఇతరత్రా ప్రయోజనాలు.. అందరికీ అందవు. ఈ విషయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పరిస్థితి కాస్త నయం. అందుకే ఈ ఫీల్డ్‌తో పాటు వివిధ రంగాల్లో పనిచేయడానికి, అక్కడే స్థిరపడానికి విదేశాలకు వలస వెళుతున్నారు. ఇందులో ముఖ్యమైనది ఉపాధి అవకాశాలే. ఎందుకంటే.. అమెరికాతో పాటు యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాల్లో మనవాళ్లు ఎక్కువగానే ఉన్నారు. విస్తృతమైన ఉపాధి అవకాశాలే దీనికి కారణం.