- Telugu News Photo Gallery World photos Know the weird names of railway station unique rail stations name bizarro and withour visa you singapur visits
రైలులో సింగాపూర్‌కు ప్రయాణం.. వీసా అవసరమే లేదు ఇంకా.. దారిలో వింత పేర్లతో స్టేషన్లు.. మీకు తెలుసా ఈ విషయాలు..
రైలు ప్రయాణం అంటే ఇష్టముండని వారుండరు. రైల్లో కిటికీ పక్కన కూర్చుని.. ప్రకృతిని చూస్తూ.. ప్రయాణించడం కంటే అందమైన అనుభూతి మరొకటి ఉండదు. అలా వెళ్తూ గమ్యాన్ని చేరుకుని సమయంలో ఎన్నో స్టేషన్లు వస్తుంటాయి. అందులో కొన్ని స్టేషన్ల పేర్లు చూస్తుంటే ఆశ్చర్యం కలగకమానదు. అలాంటి కొన్ని వింత స్టేషన్స్ గురించి తెలుసుకుందామా.
Rajitha Chanti | Edited By: Ravi Kiran
Updated on: Sep 27, 2021 | 6:13 PM

భారతీయ రైల్వే దేశ ప్రజలకు జీవనాడి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తారు. కరోనా ప్రభావంతో రైల్వే వ్యవస్థ పూర్తి స్తంభించిపోయింది. ఇప్పుడిప్పుడే తిరిగి రైల్వే సంస్థ కోలుకుంటుంది. తిరిగి యాధావిథిగా రైల్లు నడుస్తున్నాయి. సుధీర్ఘ ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఎన్నో వింత పేర్లతో రైల్వే స్టేషన్లు కనిపిస్తుంటాయి. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

సాధారణంగా సింగపూర్ అంటే ఠక్కున గుర్తొచ్చేది వీసా. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే సింగాపూర్‌కు వీసా అవసరమే లేదు. సింగాపూర్ రోడ్ స్టేషన్.. (SPRD/సింగాపూర్ రోడ్). ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంది. బిలాస్‌పూర్ తిరుపతి ఎక్స్‌ప్రెస్, సమతా ఎక్స్‌ప్రెస్, హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌తో సహా 25 కి పైగా రైళ్లు ఈ దారి గుండా వెళ్తాయి. ఈ దారిలో ఎన్నో వింత స్టేషన్లు ఉన్నాయి.

బాప్ రైల్వే స్టేషన్: బాప్ రైల్వే స్టేషన్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉంది. ఈ రైల్వే స్టేషన్ జోధ్‌పూర్ జంక్షన్ సమీపంలో ఉంది. ఇది వాయువ్య ప్రాంతంలో వస్తుంది. ఈ స్టేషన్‌లో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగుతాయి.

నానా రైల్వే స్టేషన్: నానా రైల్వే స్టేషన్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో సిరోహి పింద్వారా అనే ప్రదేశంలో ఉంది. ఈ స్టేషన్‌లో కేవలం రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే ఆగుతాయి.

దివానా రైల్వే స్టేషన్: దీవానా రైల్వే స్టేషన్ హర్యానాలోని పానిపట్ సమీపంలో ఉంది. ఈ స్టేషన్ ఉత్తర రైల్వే ఢిల్లీ డివిజన్ కిందకు వస్తుంది. ఈ స్టేషన్‌లో రెండు ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. ప్రతిరోజూ ఇక్కడ 16 రైళ్లు కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఆగుతాయి.

సాలి రైల్వే స్టేషన్: రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలోని డుడు అనే ప్రదేశంలో సాలి రైల్వే స్టేషన్ ఉంది. ఇది వాయువ్య రైల్వేకు అనుసంధానించబడి ఉంది. అజ్మీర్ దీనికి సమీపంలో ఉన్న అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్.

సహేలి రైల్వే స్టేషన్: ఈ స్టేషన్ సెంట్రల్ రైల్వేలోని హోషంగాబాద్ జిల్లాలోని నాగపూర్ డివిజన్‌లో భోపాల్, ఇటార్సీ సమీపంలో ఉంది. కీర్తాఘర్, కళా అఖర్ స్టేషన్ సమీపంలో ఉన్న సహేలి రైల్వే స్టేషన్‌లో 2 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. ఇక్కడ నాలుగు రైళ్లు ఆగుతాయి.





























