- Telugu News Photo Gallery World photos Know some intersting and mysterious facts about palmyra island
ప్రపంచంలోనే వింత ద్వీపం.. అక్కడకు వెళ్లాలంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే.. ఎక్కడుందో తెలుసా..
ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. ఇప్పటికీ మనకు తెలియని రహస్య ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అలాగే ఎన్నో ద్వీపాలు కూడా ఉన్నాయి. అందులో అత్యంత రహస్యమైన ద్వీపం గురించి తెలుసా.. అక్కడకు వెళ్లడమంటే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. అదెక్కడుందో తెలుసుకుందామా.
Updated on: Sep 26, 2021 | 1:10 PM

చుట్టూ నీరు, పచ్చదనంతో ఎంతో అందమైన దృశ్యాలతో కలిసి ఉన్న ద్వీపం గురించి చాలా మందికి తెలియదు. చూడటానికి ఎంతో అందంగా ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ ద్వీపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ద్వీపం పేరు పామిరా. అమెరికాలోని సమౌ హైవేలో ఉంది. ఇక్కడ ఒక్క మనిషి కూడా కనిపించడు. అలాగే అక్కడ గిరిజనులు కూడా లేరు.

1798 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ అనేక వింత సంఘటనలు జరిగాయి. ద్వీపం మీదుగా వెళ్తున్న విమానాలు, నౌకలు రహస్యంగా అదృశ్యమవుతున్నాయి. దీని గురించి తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి విషయాలను తెలుసుకోలేకపోయారు.

ఈ ద్వీపం శాపగ్రస్తమని ప్రజలు నమ్ముతారు. అందుకే ఇక్కడకు వెళ్లినవారు ఇప్పటికీ తిరిగి రాలేదు. అలా ఎన్నో రికార్డులు బయటకు వచ్చాయి. దీనిలో చాలా మంది ఈ ద్వీపాన్ని సందర్శించిన తర్వాత తిరిగి రాలేదని పేర్కొన్నారు.

ఇవే కాకుండా ఈ ద్వీపాన్ని సందర్శించిన తర్వాత తిరిగి వచ్చినవారు చాలా మందే ఉన్నారు. వారు ఆ ప్రదేశంలో తమకు చాలా వింతగా అనిపించిందని అంటుంటారు.

ఇక్కడ వారు అనేక మర్మమైన శక్తులను ఎదుర్కొన్నారని వారు చెప్పారు. అందుకే ఇక్కడకు వెళ్లాలంటే.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే.





























