- Telugu News Photo Gallery World photos Know the dart mission nasa will launch spacecarft who collide with asteroid in space
Dart Mission: అంతరిక్షంలో నాసా సరికొత్త ప్రయోగం.. ఉల్కను ఢీకొట్టనున్న స్పేస్‌క్రాఫ్ట్.. తర్వాత పరిస్థితి ఏంటీ ?..
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఉద్దేశపూర్వకంగా అంతరిక్షంలోని ఉల్కను తన స్పేస్‌క్రాఫ్ట్ ఢీకొట్టబోతుంది. దీనికి డార్ట్ మిషన్ అని పేరు పెట్టారు.
Updated on: Nov 22, 2021 | 12:40 PM

ఈ స్పేస్‌క్రాఫ్ట్ పాతది కాదు. కేవలం తన జీవితకాలాన్ని..నాణ్యతను కోల్పోయింది. దీంతో ఆ స్పేస్‌క్రాఫ్ట్‌ను క్రాష్ చేయాలని నాసా భావిస్తోంది. డార్ట్ డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ కోసం దీనిని రూపొందించారు.

ఈ పరీక్ష కోసం నవంబర్ 24న ఉదయం 11.50 గంటలకు అంతరిక్షంలోకి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డార్ట్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించనున్నారు. భూమి వైపు దూసుకువస్తున్న ఉల్క దిశను మార్చవచ్చా ? విషయాన్ని ఈ ప్రమోగం ద్వారా తెలుసుకోవాలని నాసా ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరీక్ష చేయడం ఇదే మొదటి సారి.

ప్రతిరోజూ.. రిఫ్రిజిరేటర్ల నుంచి కారు సైజ్ అంతవరకు చిన్న చిన్న ఉల్కలు భూకక్ష్యలోకి ప్రవేశిస్తాయి. వీటిలో చాలా వరకు వాతావరణ రాపిడికి నాశనం అవుతాయి. అలాంటి అనేక ఉల్కలు ఇప్పటికీ అంతరిక్షంలో ఉన్నాయి. ఇది ఎప్పటికీ భూమికి పెను ముప్పు. డిమోర్ఫోస్ అనే చిన్న ఉల్కతో వ్యోమనౌక ఢీకొట్టబోతుంది. ఇది డిడిమోస్ అనే పెద్ద ఉల్క చుట్టూ తిరుగుతోంది.

డార్ట్‌ను తాకిన ఉల్క పొడవు దాదాపు 169 మీటర్లు ఉంటుంది. ఈ తాకిడి వలన ఉల్క వేగం, దిశ రెండింటినీ మారుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ ఈ ఉల్క వలన భూమికి ఎలాంటి ప్రమాదం లేదు. ఒకవేళ ఈ మిషన్ సక్సెస్ అయితే భవిష్యత్తులో మన భూమి వైపు వచ్చే ఉల్కల దిశను నాసా మార్చగలదు. డార్ట్ స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తొలి ప్రయత్నంలోనే సాధించే అవకాశం ఉన్నట్లు కాదు. సాంకేతిక లోపం లేదా ప్రతికూల వాతావరణం కారణగా ప్రయోగం వాయిదా పడే అవకాశం ఉంది. డిమోర్ఫోస్ ఉల్కలు సౌర వ్యవస్థలో తిరిగుతున్న మురికి రాళ్లు. వీటి పొడవు దాదాపు 169 మీటర్లు.. అర మైలు వరకు వెడల్పు ఉంటాయి.

ఈ ఉల్క తనకంటే పెద్దదైన మరో ఉల్క అయిన డిడిమోస్ చుట్టూ తిరుగుతుంటాయి. ఈ ప్రయోగం తర్వాత డార్ట్ స్పేస్‌క్రాఫ్ట్ స్వయంచాలకంగా నావిగేట్ అవుతుంది. 2022 చివరిలో డిమోర్ఫోస్ (నాసా స్పేస్‌క్రాఫ్ట్ ఆస్టరాయిడ్ కొలిషన్)తో ఢీకొంటుంది. ఆ సమయంలో ఈ ఉల్క భూమికి 7 మిలియన్ మైళ్ల దూరంలో ఉంటుంది. అంటే ఢీకొనేటప్పుడు లేదా ఆ తర్వాత భూమికి ఎలాంటి ప్రమాదం ఉండదు.





























