నేటి కాలంలో చాలామంది అధిక బరువు (ఊబకాయం) సమస్యతో బాధపడుతున్నారు.. స్థూలకాయాన్ని నివారించేందుకు గంటల తరబడి జిమ్ లలో చెమటోడ్చడం, వాకింగ్ చేయడం, డైటింగ్ వంటి నియమాలను అనుసరిస్తున్నారు. అయితే.. గుండెపోటు లాంటి ప్రమాదకర పరిస్థితులకు అధిక బరువు కూడా కారణమని వైద్యనిపుణులు హెచ్చరిస్తుండటంతో ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు.. వాస్తవానికి బిజీ లైఫ్‌లో అనారోగ్యకరమైన ఆహారం, చెడు జీవనశైలి శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. దీని కారణంగా కడుపులో అదనపు కొవ్వు పెరగడం ప్రారంభమవుతుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును వదిలించుకోవడానికి, కొన్ని అలవాట్లను ఉదయాన్నే దినచర్యలో చేర్చుకోవాలి. అటువంటి పరిస్థితిలో ఉదయాన్నే అవలంభిచాల్సిన చర్యల గురించి ఇప్పుడు తెలుసుకోండి..