Whisky Vs Soda: మందు బాబులు.. విస్కీలో సోడా కలుపుకుని ఎందుకు తాగుతారో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే..
ప్రపంచంలో అత్యధికంగా విస్కీని వినియోగించే దేశాలలో భారత్ ఒకటి. ప్రపంచంలోని ప్రతి రెండవ బాటిల్ విస్కీ భారత్‌లో అమ్ముడవుతోంది. దేశంలో తలసరి వినియోగం 2.6 లీటర్ల విస్కీదే కావడం విశేషం. అయితే భారత్‌లో సోడాతో విస్కీ తాగే సంప్రదాయం అనాదిగా వస్తుంది. అసలు విస్కీని సోడాతో ఎందుకు తాగుతారు? సోడా లేకుండా విస్కీ తాగితే ఏమి జరుగుతుంది?
Updated on: Aug 22, 2025 | 6:49 PM

స్టాటిస్టా నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా విస్కీని వినియోగించే దేశాలలో భారత్ ఒకటి. ప్రపంచంలోని ప్రతి రెండవ బాటిల్ విస్కీ భారత్‌లో అమ్ముడవుతోంది. దేశంలో తలసరి వినియోగం 2.6 లీటర్ల విస్కీదే కావడం విశేషం. అయితే భారత్‌లో సోడాతో విస్కీ తాగే సంప్రదాయం అనాదిగా వస్తుంది. అసలు విస్కీని సోడాతో ఎందుకు తాగుతారు? సోడా లేకుండా విస్కీ తాగితే ఏమి జరుగుతుంది? వంటి అనుమానాలు చాలా మందికి ఉంటాయి.

విస్కీలో దాదాపు 40 నుంచి 50 శాతం ఆల్కహాల్ ఉంటుంది. విస్కీ చాలా స్ట్రాంగ్‌గా ఉండటం గొంతులో చికాకు కలిగిస్తుంది. అందువల్లనే దీనిని నేరుగా తాగడం కష్టం. సోడా ఈ చికాకును తగ్గిస్తుంది. శీతలీకరణ ప్రభావాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది విస్కీని రిఫ్రెష్ చేస్తుంది. సోడాను జోడించడం వల్ల విస్కీ రుచి కూడా మృదువుగా మారి త్రాగడానికి అనుకూలంగా ఉంటుంది.

గమనిక: మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ కథనం ఉద్దేశ్యం కేవలం సమాచారాన్ని అందించడం మాత్రమే. మరిన్ని వివరాల కోసం నిపుణులు, వైద్యులను సంప్రదించడం బెటర్.

నిపుణుల అభిప్రాయం ప్రకారం విస్కీలో అనేక రకాల సుగంధ సమ్మేళనాలు ఉంటాయి. దీనిని సోడా లేదా నీటితో కలిపినప్పుడు ఈ రుచులు విడుదలవుతాయి. సోడాను విస్కీతో కలపడానికి ఇది కూడా ఒక కారణమే. దీని వలన మత్తు క్రమంగా పెరుగుతుంది. హ్యాంగోవర్ తగ్గుతుంది.

విస్కీని నేరుగా తాగడం వల్ల కడుపు దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఆమ్లత్వం, చికాకు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. సోడా విస్కీని మృదువుగా చేస్తుంది. స్రాంగ్ ఆల్కహాలిక్ పానీయాలు ముక్కు, నాలుకను తిమ్మిరి వచ్చేలా చేస్తాయి. గొంతులో చికాకు కలిగిస్తాయి. ఇది కాలేయానికి చాలా హానికరం. అందుకే విస్కీని సోడాతో కలిపి తాగుతారు. అయితే ఆల్కహాల్ ఏ రూపంలో తీసుకున్నా హానికరమనే విషయం గుర్తుంచుకోవడం మంచిది.




