- Telugu News Photo Gallery Cinema photos Beautiful photos of Meenakshi Chowdhury enjoying herself on the beach
జాలీ జాలీగా.. బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న మీనాక్షీ చౌదరి!
అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ చిన్నది బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ.. తన అందాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అందులో ఈ బ్యూటీని చూస్తే కళ్లు తిప్పుకోవడం కష్టమే అంతలా తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంటుంది.
Updated on: Aug 22, 2025 | 7:02 PM

అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిన్నది వరసగా హిట్స్ అందుకుంటూ తన అంద, నటనతో ప్రతి ఒక్కరినీ దోచేసుకుంటుంది. వెబ్ సీరస్‌లతో కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ అందుకుంటూ టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌గా తన సత్తాచాటుతుంది.

మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ అందుకోకపోయినప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం తెలుగు అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరసగా ఆఫర్స్ వచ్చాయి.

తర్వాత రవితేజ కిలాడీ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. తర్వాత వరసగా హిట్ 2, మహేష్ బాబు సరసన గుంటూరు కారం, లక్కీ భాస్కర్ ఇలా వరసగా ఆఫర్స్ అందుకుంటూ తన హవా కొనసాగించింది. ఈ మూవీస్ తర్వాత వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం మూవీలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

అనిల్ రావుపూడి, వెంకటేష్ కాంబోలో వచ్చిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి వెంకీ గర్ల్ ఫ్రెండ్‌గా నటించి, తన నటన, గ్లామర్‌తో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అటు ఫ్యామిలీ ఆడియన్స్, ఇటు యూత్‌ను ఆకట్టుకుంది ఈ చిన్నది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా జపాన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.



