- Telugu News Photo Gallery What happens when you drink Amla, Beetroot, and Carrot Juice daily on an empty stomach
సన్నజాజి తీగలా మారాలా? ఐతే ఈ జ్యూస్ ఖాళీ కడుపుతో 15 రోజులు తాగండి
Amla, beetroot and curry leaf juice for weight loss: నేటి కాలంలో అధిక బరువు ఓ పెద్ద సమస్యగా మారింది. బరువు పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే, ఈ జ్యూస్‌ను మీ డైట్‌లో చేర్చుకోండి..
Updated on: Nov 16, 2025 | 12:08 PM

నేటి కాలంలో అధిక బరువు ఓ పెద్ద సమస్యగా మారింది. బరువు పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే, ఈ జ్యూస్‌ను మీ డైట్‌లో చేర్చుకోండి.

ఆరోగ్యంగా ఉంటూనే బరువు తగ్గడం అనేది ఒక పెద్ద సవాలు. బరువు తగ్గే విషయానికి వస్తే అందులో ఆహారం పాత్ర చాలా కీలకం. బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు ఆహారాన్ని తప్పక మార్చుకోవాలి.

ఇందులో ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి బీట్‌రూట్, ఉసిరి, కరివేపాకుతో తయారు చేసిన జ్యూస్ ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే వేగంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎలా తయారు చేయాలంటే..

ముందుగా బీట్‌రూట్, ఉసిరి తీసుకుని, అందులో కొన్ని రెబ్బలు కరివేపాకు వేయండి. ఈ మూడు పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్‌ను వరుసగా 15 రోజుల పాటు తీసుకోవాలి. ఆ తర్వాత మీ కళ్లను మీరే నమ్మలేనంత మార్పు మీ శరీరంలో గమనిస్తారు. ఈ జ్యూస్ బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.




