- Telugu News Photo Gallery What Happens If You Eat Ginger Every Day For 1 Month In Telugu Health Tips
Ginger: నెలరోజుల పాటు ఇలా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా..? ఆ రోగాలు ఫసక్..!
అల్లం..ఇది ఒక పచ్చి మసాలా దినుసు.. అల్లంతో అనేక రకాల వంటకాలు చేస్తుంటారు. అల్లంతో వంటకు మంచి ఘాటైన రుచి వస్తుంది. కేవలం రుచి మాత్రమే కాదు.. అల్లంతో లెక్కలెనన్నీ ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే అల్లాన్ని ఎన్నో వైద్యులకు ఔషధంగా కూడా వినియోగిస్తారని చెబుతున్నారు. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చునని వివరిస్తున్నారు. పూర్తి డిటెల్స్‌కి వెళితే...
Updated on: Jul 23, 2025 | 2:00 PM

అల్లం రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేసి, జుట్టును బలంగా, ఒత్తుగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఈ సహజ ఔషధాన్ని మీ రోజువారీ జీవనశైలిలో చేర్చుకోవడం మంచిది.

అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అదనపు కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో సహాయపడుతుందే కాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆకలిని పెంచడంలో అల్లం బాగా సహాయ పడుతుంది.

ముఖ్యంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు, తలనొప్పి, మైగ్రేన్, నడుంనొప్పి, వెన్నుపూస నొప్పి, మోకాలి నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటి సమస్యలను తగ్గించడానికి అల్లం బాగా పనిచేస్తుంది. ఇందులో నొప్పి, వాపును తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. రోజుకు 2 నుంచి 5 గ్రాముల అల్లంను రెండు వారాల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అల్లంతో కలిగే లాభాల్లో ముఖ్యంగా కీమోథెరపీ, రేడియోథెరపీ, క్యాన్సర్ బాధితులకు ఆకలి తగ్గిపోతుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కొన్నిసార్లు ఆకలిగా అనిపించదు. అలాంటివారికి నీళ్లల్లో నిమ్మరసం, అల్లం కలిపి ఇవ్వడం వల్ల ఆకలి పెరుగుతుంది.

ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో అల్లం తినడం లేదా అల్లం నీరు తాగడం శరీర డిటాక్స్‌కు సహాయపడుతుంది. ఒక నెలపాటు ప్రతిరోజూ అల్లం తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అల్లంలోని పదార్థాల వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్‌ల పరిమాణం తగ్గుతుంది.




