West Godavari: కడలిగర్భంలో కలిసిపోతోన్న మరో గ్రామం.. సర్వం కోల్పోతున్న ఆ ఊరు
కన్న తల్లిగా సముద్రాన్ని పూజిస్తారు. నిత్యం కడలి ఒడిలో ఉండే మత్సకారులు ఇప్పుడు సముద్రమంటే నే భయపడిపోతున్నారు. గడచిన దశాబ్ద కాలంలో రెండు కిలోమీటర్ల మేర సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. ఆటు పోటుల సమయంలో అమాంతం మీదకు వస్తుంది. తుఫాను వస్తుంది అంటే గ్రామస్తులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. తుఫానుల సమయంలో సముద్రం ముందుకు రావడంతో ఇప్పటికే నరసాపురం మండలంలోని చినమైనవానిలంక కడలి గర్భంలో కలసి పోయింది. ఇక బియ్యపుతిప్ప, పెదమైనవాని లంక గ్రామాలలోని వేలాది ఎకరాలు కడలి గర్భంలో కలసి పోయాయి..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
