- Telugu News Photo Gallery Kannur University to provide higher education to students affected by ethnic strife in Manipur
Manipur Students: సూపర్.. మణిపూర్ విద్యార్థులకు ఆ రాష్ట్రం బంపర్ ఆఫర్..
మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్ల వల్ల అక్కడి విద్యా్ర్థుల చదువులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. చాలామంది విద్యకు దూరమైపోయారు. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రానికి కన్నూర్ యూనివర్శిటీ ఆ రాష్ట్ర విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడుయేట్ చదవాలనుకునే విద్యార్థులు తమను సంప్రదించాలని ఆ యూనివర్శిటీ ఉప కులపతి డాక్టర్ గోపినాథ్ రవీంద్రన్ చెప్పారు.
Updated on: Aug 07, 2023 | 10:21 PM

మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్ల వల్ల అక్కడి విద్యాార్థుల చదువులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. చాలామంది విద్యకు దూరమైపోయారు. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రానికి కన్నూర్ యూనివర్శిటీ ఆ రాష్ట్ర విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది.

అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడుయేట్ చదవాలనుకునే విద్యార్థులు తమను సంప్రదించాలని ఆ యూనివర్శిటీ ఉప కులపతి డాక్టర్ గోపినాథ్ రవీంద్రన్ చెప్పారు.

మణిపుర్ విద్యార్థి సంఘాలు నుంచి వచ్చిన విజ్ఞప్తిలను పరిగణలోకీ తీసుకన్నామని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గోపినాథ్ చెప్పారు. ఈ అంశంపై యూనివర్శిటీ సిబ్బందితో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ అభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొన్నారు.

అలాగే విద్యార్థుల అవసరాలకు తగ్గట్లుగానే.. యూనివర్శిటీ, యూనివర్శిటీ అనుబంధ కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. మణిపుర్‌లో విద్యకు దూరమవుతున్న వారికి తమ యూనివర్శిటీ ప్రత్యేక సీట్లు కేటాయిస్తున్నామని.. విద్యార్థులు ప్రవేశం పొందిన తర్వాత విద్యార్హత పత్రాలు సమర్పించేందుకు తగినంత సమయం కూడా ఇస్తామని చెప్పారు.

ఇదిలా ఉండగా గత నెలలో మణిపుర్ రాష్ట్రానికి చెందిన ఓ బాలుడు కేరళలోని తిరువనంతపురంలో ప్రభుత్వ పాఠశాలో మూడే తరగతి చేరిన విషయాన్ని చెప్పారు. ఆ తర్వాతే మణిపుర్ విద్యార్థులు తమతో సంప్రదింపులు చేసేందుకు వచ్చారని తెలిపారు. ఇలాంటి పనుల వల్ల కేరళ ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.




