- Telugu News Photo Gallery Wearing face packs with saffron will give you a golden look, Check Here is Details
Saffron for Skin: కుంకుమ పువ్వుతో ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే.. బంగారంలా మెరిసిపోతారు..
కుంకుమ పువ్వును ఎక్కువగా గర్భిణీలు ఉపయోగిస్తారు. పుట్టబోయే బిడ్డ తెల్లగా, అందంగా పుట్టడం కోసం పాలలో కలిపి తాగుతూ ఉంటారు. కానీ ఈ కుంకుమ పువ్వుతో చర్మ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. అందాన్ని పెంచడంలో సాఫ్రాన్ చక్కగా పని చేస్తుంది. మరి అదెలాగో చూసేయండి..
Updated on: Jan 29, 2025 | 1:36 PM

కుంకుమ పువ్వు అంటే కేవలం గర్భిణీలు మాత్రమే వాడుతారు అనుకుంటే పొరపాటే. కుంకుమ పువ్వుతో మంచి గ్లోయింగ్ స్కిన్ కూడా సొంతం చేసుకోవచ్చు. చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా కుంకుమ పువ్వు చక్కగా సహాయ పడుతుంది.

ఇంట్లోనే ఈ కుంకుమ పువ్వు ఉపయోగించి గోల్డెన్ లుక్ సొంతం చేసుకోవచ్చు. ఈ కుంకుమ పువ్వతో ఎన్నో రకాల ఫేస్ ప్యాక్స్ ట్రై చేయవచ్చు. కాస్త శ్రద్ద పెడితే.. పార్లర్ లాంటి లుక్‌ని ఇంట్లోనే పొందవచ్చు. మరి ఆ ఫేస్ ఫ్యాక్స్ ఏంటో చూసేయండి.

ఓ గిన్నెలోకి బాదం పప్పు పేస్ట్, పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు, కొద్దిగా పసుపు, అవసరం అయితే మరిన్ని పాలు వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి బాగా పట్టించి.. పావుగంట తర్వాత క్లీన్ చేయాలి. ఇలా చేస్తే.. ముడతలు, మచ్చలు తగ్గుతాయి.

మరో ప్యాక్ కోసం.. పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు, తులసి ఆకుల రసం లేదా పేస్ట్, పసుపు కలిపి మొత్తం ముఖానికి అప్లై చేయండి. ఓ పావు గంట తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే.. పింపుల్స్ తగ్గి.. మంచి గ్లో వస్తుంది.

ఇంకో ఫేస్ ప్యాక్.. పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వును ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా శనగ పిండి, పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావు గంట తర్వాత క్లీన్ చేయండి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.. మచ్చలు పోయి.. మంచి గ్లో వస్తుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




