- Telugu News Photo Gallery Storing yogurt in the fridge? These things are for you, Check Here is Details in Telugu
Curd in Fridge: పెరుగును ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగు నుంచి అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. పెరుగుతో చాలా సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ మీరు తినే పెరుగు నుంచి ఆ పోషకాలు అందుతున్నాయా.. ఎందుకంటే పెరుగును ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయడం వల్ల ఎలాంటి పోషకాలు శరీరానికి అందవు..
Updated on: Jan 29, 2025 | 1:21 PM

ఫ్రిడ్జ్ వచ్చాక అందులో అనేక పదార్థాలను స్టోర్ చేయడం అలవాటు అయిపోయింది. కానీ ఫ్రిడ్జ్‌లో కొన్ని రకాల పదార్థాలను అస్సలు పెట్టకూడదు. ఇలా స్టోర్ చేయడం వల్ల వాటి నాణ్యత అనేది తగ్గిపోతుంది. వాటిల్లో పెరుగు కూడా ఒకటి.

ఫ్రిడ్జ్‌లో పెరుగును పెట్టడం వల్ల నిల్వ ఉంటుంది. బాగుంటుంది.. పుల్లగా మారదని అందరూ అనుకుంటారు. కానీ పెరుగను ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన పని లేదు. సాధారణంగా ఒక బాక్సులో పెట్టిన పక్కన స్టోర్ చేసుకోవచ్చు. రెండు రోజుల వరకు పెరుగు పాడవ్వదు.

పెరుగును ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల.. ఆ చల్లదనానికి పెరుగులో ఉండే ప్రోబయోటిక్ అనే బ్యాక్టీరియా చనిపోతుంది. ఆ తర్వాత మీరు పెరుగు తిన్నా ఎలాంటి లాభం ఉండదు. కాబట్టి పెరుగును మీరు బయట గది ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేసుకోవచ్చు.

పెరుగు నాణ్యత కూడా తగ్గిపోతుంది. దీని వల్ల ఎలాంటి పోషకాలు మీకు అందవు. కేవలం రుచిగా మాత్రమే ఉన్నా.. పెరుగు తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు మీకు అందవు.

అంతే కాకుండా పెరును ఫ్రిడ్జ్‌లో పెడితే.. చల్లదనానికి వింత వాసన కూడా వస్తుంది. దీంతో పెరుగు తినాలనిపించదు. ఫ్రిడ్జ్ నుంచి కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది. పెరుగును ఎలాంటి డౌట్ లేకుండా బయట పెట్టుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి నష్టం ఉండదు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




