- Telugu News Photo Gallery Viral photos Interesting facts about worlds highest peak mount everest that will blow your mind
Viral Photos: ఎవరెస్ట్ పర్వతం గురించి ఐదు అద్భుత నిజాలు.. అవేంటంటే..?
Viral Photos: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. దీనిని అధిరోహించడం ప్రతి పర్వతారోహకుడి కల. ప్రతి సంవత్సరం వందలాది మంది సాహసికులు
Updated on: Jan 29, 2022 | 2:57 PM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. దీనిని అధిరోహించడం ప్రతి పర్వతారోహకుడి కల. ప్రతి సంవత్సరం వందలాది మంది సాహసికులు ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి ప్రయత్నించినప్పటికీ అందులో విజయం సాధించే అదృష్టం కొద్దిమందికి దక్కుతుంది.

ఈ పర్వతం హిమాలయాలలో భాగం దీనిని నేపాల్ ప్రజలు సాగర్‌మాత అని పిలుస్తారు. టిబెట్‌లో శతాబ్దాలుగా దీనిని చోమోలాంగ్మా అంటే 'పర్వతాల రాణి' అని పిలుస్తారు.

మీడియా కథనాల ప్రకారం.. 2015లో వచ్చిన తీవ్ర భూకంపం తర్వాత ఎవరెస్ట్ ఎత్తులో మార్పు వచ్చి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అందుకే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ పర్వతాన్ని మళ్లీ కొలిచే ప్రయత్నంలో ఉన్నారు నిపుణులు.

ఎవరెస్ట్‌ను మొదటిసారిగా 1841లో సర్ జార్జ్ ఎవరెస్ట్ కనుగొన్నారు. అతను దీనికి పీక్ 15 అని పేరు పెట్టాడు. అయితే 1865లో సర్ జార్జ్ ఎవరెస్ట్ గౌరవార్థం ఈ పర్వతం పేరు ఎవరెస్ట్‌గా మార్చారు.

హిమాలయాల గురించి మరో విషయం ఏంటంటే ఎవరెస్ట్ ఎత్తు ప్రతి సంవత్సరం పెరుగుతోంది. టెక్టోనిక్ ప్లేట్లు మారడం వల్ల ఇది జరుగుతోంది.





























