మండపాల్లోని లేదా ఇంట్లో ప్రతిష్టించే వినాయకుని విగ్రహాన్ని పూలు, పండ్లు, స్వీట్లు, వివిధ రకాల నైవేద్యాలతో అలంకరిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, భజన కీర్తనలు కూడా నిర్వహిస్తారు. పదో రోజుల పాటు జరిగే గణేశుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ. ఈ సంవత్సరం మీ ఇంట్లో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నట్లయితే ఇంటిలో పూజ గదిని, ఇంటి అలంకరణ కోసం ఈ చిట్కాలను అనుసరించండి.