AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oxygen Plants: మీకు మొక్కలంటే ఇష్టమా..? ఇవి మీ ఇంట్లో ఉంటే.. ఆరోగ్యం, ఐశ్వర్యం..!

ప్రస్తుతం చాలా మందికి గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంట్లో స్థలం లేకపోయినా, టెర్రస్‌పై, బాల్కనీలో, మొట్లపైనా ఇలా ఇళ్లంతా మొక్కలతో తమ పరిసరాలను పచ్చదనంతో కలకల లాడేలా మారుస్తున్నారు. ఇలా మొక్కలు పెంచడం కేవలం టైమ్‌పాస్‌ ఇంటికి అందం మాత్రమే కాదు.. కొన్ని మొక్కలు ఆక్సిజన్ బ్యాంకులుగా పనిచేస్తాయి. అలాంటి మొక్కలను పెంచుకోవటం వల్ల ఇంటి అందంతో పాటు మీ ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటుంది.. అంతేకాదు.. ఈ మొక్కలు కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా ఇంట్లో పచ్చదనం, సానుకూల శక్తిని కూడా పెంచుతాయి. వాటి సంరక్షణకు తక్కువ శ్రమ అవసరం. ఇంట్లో, ఆఫీసులో లేదా బాల్కనీలో ఎక్కడైనా సులభంగా పెరుగుతాయి. అలాంటి ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ గురించి ఇక్కడ చూద్దాం...

Jyothi Gadda
|

Updated on: Oct 15, 2025 | 9:33 AM

Share
నేటి ఆధునిక కాలంలో బయట కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రజలు తమ ఇళ్లలో స్వచ్ఛమైన గాలిని పొందేందుకు గానూ అవగాహన కల్పించుకుంటున్నారు. పెద్ద యంత్రాలు, ఎయిర్ ప్యూరిఫైయర్ల వినియోగం కాకుండా  మొక్కలతో ఇండోర్ గాలిని శుద్ధి చేసే సంప్రదాయం ప్రజల్లో తిరిగి వస్తోంది.

1 / 5
Peace Lily: పీస్ లిల్లీ మొక్క గాలిని శుద్ధి చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇది గాలి నుండి దుమ్ము, విష పదార్థాలను తొలగిస్తుంది. ఇది వికసించే తెల్లటి పువ్వులు ఇంటి అందాన్ని కూడా పెంచుతాయి.

2 / 5
Aloe Vera Plant: ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో కలబంద మొక్కను తప్పనిసరిగా పెంచుకోవాలని చెబుతుంటారు. దీనికి అనేక రసాయనాలను తరిమికొట్టే సామర్థ్యం ఉంది. ఈ మొక్క సూర్యకాంతిలో బాగా పెరుగుతుంది. దీనిని కిటికీ దగ్గర కూడా పెట్టి పెంచుకోవచ్చు.

3 / 5
Areca Palm: అరికా పామ్ మొక్క దాని పెద్ద ఆకుల ద్వారా గాలిలోని దుమ్ము కణాలను గ్రహిస్తుంది. గదిలో తేమను నిర్వహిస్తుంది. అయితే, దీనికి క్రమం తప్పకుండా నీరు పెట్టడం, ప్రత్యక్ష సూర్యకాంతి నుండి రక్షించడం అవసరం.

4 / 5
snake plants: ఇంట్లో గాలిని శుద్ధి చేయడానికి స్నేక్‌ ప్లాంట్‌ పెంచుకోవచ్చు. దీని అత్యంత విలక్షణమైన లక్షణం ఏమిటంటే ఇది రాత్రిపూట కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. చాలా మొక్కలు పగటిపూట మాత్రమే అలా చేస్తాయి. దీన్ని గదిలో ఉంచడం వల్ల నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది.

5 / 5