- Telugu News Photo Gallery These drinks are very famous in Andhra and Telangana, you should try them at least once
Telugu States Drinks: ఆంధ్ర, తెలంగాణలో ఈ డ్రింక్స్ చాలా ఫేమస్.. ఒక్కసారైనా తాగాలి..
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆహారాలు చాల రుచికరంగా ఉంటాయి. వీటి రుచి చూస్తే అస్సలు వదలరు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో దొరికే కొన్ని ఐకానిక్ పానీయాలు ఉన్నాయి. మరి ఆంధ్ర, తెలంగాణలో ఆ రుచికరమైన డ్రింక్స్ ఏంటి.? అవి ఎక్కడ ఎక్కువగా లభిస్తాయి.? ఈరోజు పూర్తి వివరాలతో తెలుసుకుందాం రండి..
Updated on: Jun 13, 2025 | 6:07 PM

ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో రోజ్ మిల్క్. చాలా ప్రసిద్ధమైన రోజ్ వాటర్ ఫ్లేవర్ పాల పానీయం. రాజమండ్రి వెళ్తే తప్పక ప్రయత్నించాలి. దీని రుచి చాల అద్భుతంగా ఉంటుంది. ఇది ప్రస్తుతం అన్ని ఏరియాల్లో దొరుకుతున్న ఈ టేస్ట్ వేరు. ఎందుకంటే ఇది వచ్చిందే ఇక్కడనుంచి.

ఆంధ్ర ప్రదేశ్ స్థానికులు మెంతులు, మజ్జిగ ఉపయోగించి మెంతి మజ్జిగ అనే రుచికరమైన మజ్జిగ పానీయాన్ని తయారు చేస్తారు. ఇది ప్రతి ఇంట్లో చేసుకొంటారు. అలాగే కొన్ని ప్రదేశాల్లో ప్రత్యేకంగా తయారు చేసి అమ్ముతున్నారు.

ఆంధ్రప్రదేశ్లోని అరకులో కాఫీ ఒక్కసారైన తాగాలి. రియల్ కాఫీ టేస్ట్ కోసం దీన్ని ప్రయత్నించండి. దీని రుచిని చూస్తే అస్సలు వదిలిపెట్టారు. దీని కోసం అక్కడ ఉన్న తోటల నుంచి స్వీకరించిన కాఫీ గింజలను పొడి వాడుతారు. ఈ కాఫీ పొడిలో కెమికల్స్ ఉండవు.

100 ఏళ్ల చరిత్ర కలిగిన గోదావరి డ్రింక్ ఆర్టోస్ తప్పుగా తాగాల్సిందే. దీని అద్భుతమైన రుచి మరో డ్రింక్కి రాదు. ఇందులో గ్రేప్, ఆరెంజ్, ఆపిల్, పైన్ ఆపిల్, లిమెన్ వంటి ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని చోట్ల దొరుకుతున్నాయి.

తాటి చెట్ల నుంచి తాజాగా తీసుకున్న పచ్చి పానీయం కల్లు. ఇది వాస్తవానికి కొన్ని ఆరోగ్య సమస్యలకు మంచిది. ఇది ఆంధ్ర, తెలంగాణాల్లో దొరుకుతుంది. అయితే దీనిని కొంతమంది కల్తీ చేసి అమ్ముతున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తెలంగాణాలోని అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం ఇరానీ చాయ్. తెలంగాణావాసులకు ముఖ్యంగా హైదరాబాదీలకు ఇరానీ చాయ్‌పై ఉన్న ప్రేమ ఎనలేనిది. అలాగే తెలంగాణలోని హైదరాబాద్‌లో ఫలూదా తప్పనిసరిగా ప్రయత్నించాలి.




