- Telugu News Photo Gallery Spiritual photos Sun's Favor zodiac signs: These are lucky zodiac signs details in Telugu
సూర్య భగవానుడికి ఇష్టమైన రాశులివే.. రానున్న రోజుల్లో వారి పంట పండినట్టే..!
ఆత్మాభిమానం, హుందాతనం, నాయకత్వ లక్షణాలు, అధికారం, ప్రాబల్యం వంటి కారకత్వాలు కలిగిన గ్రహ రాజు సూర్య భగవానుడికి దాదాపు ఇవే లక్షణాలు కలిగిన రాశులంటే చాలా ఇష్టం. అనుకూల స్థానాల్లో ఉన్నా, దుస్థానాల్లో ఉన్నా రవి ఈ రాశుల బాగోగుల మీద ఒక కన్ను వేసే ఉంటాడు. ప్రస్తుతం మిథున రాశిలో సంచారం చేస్తున్న రవికి మేషం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, ధనూ రాశులంటే అత్యంత అభిమానం. ఈ రాశుల వారు ఈ నెల(జూన్) 15 నుంచి జూలై 16 వరకు రవి కటాక్ష వీక్షణాలను మరింత ఎక్కువగా అనుభవించబోతున్నారు.
Updated on: Jun 13, 2025 | 5:58 PM

మేషం: ఈ రాశివారిలోని నాయకత్వ లక్షణాలు, మితిమీరిన ఆత్మాభిమానం, మొండి పట్టుదల, చొరవ రవికి బాగా నచ్చుతాయి. నెల రోజుల పాటు రవి ఈ రాశివారికి అన్ని విధాలా అనుకూలతలు పెరుగుతున్నాయి. ఈ రాశివారు ఎటువంటి ప్రయత్నం చేపట్టినా నూరు శాతం ఫలితాన్ని పొందు తారు. ఆదాయం బాగా పెరిగి సంపన్నుల కోవలో చేరిపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో మరింత సమర్థవంతంగా పని చేసి పదోన్నతులు పొందుతారు. అన్ని విధాలుగానూ అభివృద్ధి ఉంటుంది.

మిథునం: ఈ రాశివారిలోని చొరవ, పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నించే ధోరణి, ఒక వ్యూహం ప్రకారం అనుకున్నవి సాధించడం వంటి లక్షణాలు రవికి బాగా నచ్చుతాయి. వీరి కృషి వల్ల ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల నెరవేరుతుంది. సంపన్నులయ్యే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల మీద పెట్టే పెట్టుబడులు నూరు శాతం లాభాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధించి లబ్ధి పొందుతారు.

సింహం: ఈ రాశికి అధిపతి అయిన రవి ప్రస్తుతం ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు తప్పకుండా అనేక విధాలుగా జీవితంలో పురోగతి సాధిస్తారు. పురోగతి సాధించడానికి అనేక అవకాశాలు అంది వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతి లభిస్తుంది. నిరుద్యోగులకు అనేక మంచి ఆఫర్లు అందుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం వృద్ధి చెందు తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.

కన్య: నాయకత్వ లక్షణాలు, అందరినీ కలుపుకునిపోయే తత్వం, ప్రణాళిక ప్రకారం వ్యవహరించడం వంటి లక్షణాలు కలిగిన ఈ రాశివారిని రవి తప్పకుండా ఉద్ధరించడం జరుగుతుంది. రాశినాథుడైన బుధుడికి మిత్ర గ్రహమైన రవి ఈ రాశివారిని నెల రోజుల్లో ఉద్యోగంలో అందలాలు ఎక్కించే అవకాశం ఉంది. రాజకీయ ప్రాబల్యం కూడా కలుగుతుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి.

వృశ్చికం: ఈ రాశన్నా, రాశ్యధిపతి కుజుడన్నా రవికి చాలా ఇష్టం. ఈ రాశివారిలోని పట్టుదల, వ్యూహ రచన, ఏదైనా సాధించాలనే ధోరణి రవికి బాగా నచ్చే అంశాలు. ఈ రాశివారికి అనేక విధాలుగా రవి చేయూతనందిస్తాడు. ఈ రాశివారికి త్వరలో ఆకస్మిక ధన లాభం కలగబోతోంది. ఉద్యోగంలో జీతాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందడంతో పాటు షేర్ల వల్ల, ఆస్తిపాస్తుల వల్ల విశేష లాభాలు కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.

ధనుస్సు: రాశ్యధిపతి గురువు పట్ల రవికి అభిమానం ఎక్కువ. ఈ రాశివారిలోని యాంబిషన్, ధైర్య సాహసాలు, ఆధిపత్య ధోరణి రవికి నచ్చే లక్షణాలు. రవి తోడ్పాటుతో ఈ రాశివారు ఊహించనంతగా పురోగతి చెందుతారు. ఏ రంగంలో ఉన్నా తమ ప్రత్యేకతను నిరూపించుకుంటారు. ప్రస్తుతం ఈ రవి ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.



















