- Telugu News Photo Gallery These are the strangest places of the world, where it is strictly forbidden to go Know Details
Forbidden Destination: ప్రపంచంలోని విచిత్రమైన, భయంకరమైన ప్రదేశాలు.. ఇక్కడికి వెళ్లడం నిషద్ధం.. ఎందుకంటే..
Forbidden Destination: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో కాస్త రిలాక్స్ కోసం ప్రజలు టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. విదేశాలకు వెళ్లి సరదాగా తిరిగి వస్తుంటారు. అందమైన ప్రదేశాల కోసం వెతుకుతారు. అయితే, ఈ ప్రపంచంలో టూరిస్టులకు ఆహ్వానం పలికే ప్రదేశాలు ఉన్నట్లే.. ఎవరూ వెళ్లేందుకు వీలు లేని, నిషేధం ఉన్న స్థలాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: May 25, 2023 | 9:22 AM

బిజీ షెడ్యూల్ నుండి విరామం తీసుకొని.. అందమైన ప్రదేశాలను సందర్శించడానికి ప్రజలు ప్లాన్ చేసుకుంటారు. అయితే, కొన్ని నిషిద్ధ ప్రదేశాలు కూడా ఉంటాయి. అక్కడికి ఎవరూ వెళ్లకూడదు. ప్రజలు ఆయా ప్రాంతాలకు వెళితే ఇబ్బందులకు గురవుతారనే ఉద్దేశ్యంతో ఆయా దేశాల ప్రభుత్వాలు నిషేధం విధించాయి.

స్నేక్ ఐలాండ్: ఈ ద్వీపం బ్రెజిల్‌లో ఉంది. గోల్డెన్ లాన్స్ హెడ్స్ పాములు ఈ ప్రదేశంలో ఎక్కువగా నివసిస్తాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాములు. ఈ ప్రదేశాన్ని సందర్శించకుండా బ్రెజిల్ ప్రభుత్వం నిషేధించింది.

సుర్ట్సే ద్వీపం: ఈ ద్వీపం ఐస్‌లాండ్‌లో ఉంది. నీటిలో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం వల్ల ఈ ద్వీపం ఏర్పడింది. దీని ప్రభావం 1963 నుండి 1967 వరకు కనిపించింది. ఈ ద్వీపాన్ని సందర్శించడానికి ప్రజలకు అనుమతి లేదు. ఇక్కడికి శాస్త్రవేత్తలకు మాత్రమే అనుమతి ఉంది.

క్విన్ షి హువాంగ్: టెర్రకోట ఆర్మీ 1974లో వెలికితీసింది. ఇక్కడ చైనా మొదటి చక్రవర్తి క్విన్ షి హువాంగ్ సమాధి కనుగొనడం జరిగింది. చైనా మొదటి చక్రవర్తి క్విన్ షి హువాంగ్ సమాధిని పిరమిడ్ కింద ఖననం చేశారు. ఈ సమాధి సుమారు 2000 సంవత్సరాల నాటిది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆవిష్కరణలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది కూడా మిస్టరీయే. నివేదికల సమాచారం ప్రకారం.. సమాధిలో అంతుచిక్కని రహస్యాలు చాలానే ఉన్నాయి. అందుకే.. అక్కడి ప్రజలు వెళ్లేందుకు నిషిద్ధం విధించడం జరిగింది.

నిహౌ ద్వీపం: ఇది యూఎస్ఏ లో ఇక్కడ బయటి వ్యక్తులకు ప్రవేశం నిషేధించబడింది. ఒకవేళ మీ బంధువులు అక్కడ నివసిస్తున్నట్లయితే.. అక్కడికి వెళ్లగలరు. యుఎస్ నేవీలో భాగమైన వారు కూడా అక్కడకు వెళ్లవచ్చు. పర్యావరణం, వన్యప్రాణులను సంరక్షించే ఉద్దేశ్యంతో ఈ ప్రాంతాన్ని నిషేధించారు.




