చలి కాలం వచ్చేసింది… ఈ సమయంలో అస్సలే తీసుకోకూడని ఫ్రూట్స్ ఇవే!
చలికాలం వచ్చేసింది. వాతావరణం మారడంతో చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సమయంలో కొన్ని రకాల పండ్లు అస్సలే తీసుకోకూడదంట. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు ధరి చేరే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. మరి శీతాకాలంలో ఎలాంటి పండ్లు తినకూదో ఇప్పుడు చూద్దాం.
Updated on: Oct 24, 2025 | 3:00 PM

దోసకాయ : చాలా మంది దోసకాయలను ఎక్కువగా తింటుంటారు. దోసకాయలు తినడం వలన శరీరం హైడ్రేట్ అవ్వడమే కాకుండా, అది ఆరోగ్య పరంగా కూడా చాలా మేలు చేస్తుంది. కానీ దీనిని శీతాకాలంలో తీసుకోవడం వలన శరీరం ఎక్కువగా చల్లబడుతుంటుంది. దీంతో జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట.

అవకాడో : చిన్న పిల్లల నుంచి పెద్ద వారికి వరకు ప్రతి సమస్యకు దివ్యఔషధం అవకాడో, ముఖ్యంగా బరువు తగ్గడం, చర్మ ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. కానీ దీనిని శీతాకాలంలో అస్సలే తీసుకోకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. చలికాలంలో ఆవకాడో తీసుకోవడం వలన ఇది ఇన్ఫెక్షన్స్ , అలెర్జీ వంటి వాటికి కారణం అవుతుందంట.

కొబ్బరి నీళ్లు : కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చలికాలంలో మాత్రం అస్సలే కొబ్బరి నీళ్లు అతిగా తాగకూడదంట. దీని వలన దగ్గు, ఛాతిలో అసౌకర్యం, కఫ సంబంధ సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ద్రాక్ష : చలికాలంలో వీలైనంత వరకు ద్రాక్షపండ్లు తీసుకోకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. శీతాకాలం సమయంలో ద్రాక్ష పండ్లు తీసుకోవడం వలన ఇది జలుబు, కఫ సమస్యలు, గొంతు నొప్పి, వంటి ఇబ్బందులకు కారణం అవుతుందంట.

పుచ్చకాయ, స్ట్రాబెర్రీస్ : పుచ్చకాయను శీతాకాలంలో తీసుకోవడం వలన అనేక సమస్యలు వస్తాయంట. అలాగే స్ట్రాబెర్రీస్‌ను శీతాకాలంలో తీసుకోవడం వలన ఇవి అలెర్జీ, దగ్గు, గొంతు నొప్పి సమస్యలను తీసుకొస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.



