ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోవడానికి బెస్ట్ టిప్స్ ఇవే!
ఎలాంటి టెన్షన్ , ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆనందంగా నిద్ర పోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కొంత మంది మాత్రమే హాయిగా నిద్రపోతారు. చాలా మంది అతి ఆలోచనలతో ఎక్కువగా నిద్రపోవడానికి ఇంట్రెస్ట్ చూపరు. అయితే మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ నిద్ర సరిగ్గా పోకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు దరి చేరుతుంటాయి. అందువలన అసలు త్వరగా, ప్రశాంతంగా ఎలా నిద్రపోవాలి? దీని కోసం పాటించాల్సిన టిప్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Oct 27, 2025 | 6:50 PM

చాలా మంది రాత్రి పడుకునే సమయంలోనే వారి జీవితంలోని ప్రతి సంఘటనలను, సమస్యలను గుర్తు చేసుకుంటుంటారు. కానీ ఎప్పుడూ కూడా పడుకునే ముందు దేని గురించి అతిగా ఆలోచించకూడదంట. పడుకోవడానికి కొన్ని నిమిషాల ముందు ఆ రోజులోని మీ బెస్ట్ మూమెంట్స్ ఏంటో వాటిని గుర్తు చేసుకొని, మీ జితంలోని సంతోష సమయాలను గుర్తు చేసుకుంటూ నిద్రపోవాలి. దీని వలన మీ మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు, హాయిగా నిద్రపోతుంది.

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం చాలా ఎక్కువైపోయింది. ఉదయం లేచి నుంచి రాత్రి పడుకొనే వారు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్‌లోనే గడిపేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో చాలా మంది ఎక్కువగా స్మార్ట్ ఫోన్ చూస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా హానికరం, రాత్రి సమయంలో ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం వలన నిద్రలేమి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే రాత్రి సమయంలో స్క్రీన్ వాడకం తగ్గించాలంట.

రాత్రి సమయంలో త్వరగా నిద్రపట్టాలి ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు నిపుణుల. రాత్రి సమయంలో లేటుగా ఆహారం తీసుకోకుండా,8 లోపు ఫుడ్ తీసుకోవాలంట. అదే విధంగా పడుకోవడానికి ముందు గ్లాస్ గోరు వెచ్చటి పాలు తాగడం వలన త్వరగా నిద్ర పట్టే ఛాన్స్ ఉన్నదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

గది వాతావరణం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి సమయంలో బెడ్ రూమ్‌లో ఎక్కువ లైటింగ్ ఉండకూడదు, ఎందుకంటే ఇది మీ నిద్రను పాడు చేసే ఛాన్స్ ఉంది. అలాగే కర్టెన్స్‌తో బెడ్ రూమ్‌లో వెలుతురు లేకుండా చూసుకోండి, అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లో బెడ్ రూమ్‌లో టీ ఉండనివ్వకండి. బెడ్ రూమ్‌లో టీ వీ ఉంటే నిద్రకు భగం వాటిల్లే ఛాన్స్ ఉంటుందంట.

అదే విధంగా పడుకోవడానికి ఒక ఖచ్చితమైన సమయాన్ని ఎంచుకోవడం అన్నింటికంటే చాలా ముఖ్యమైనది. ఇది మీకు మంచి నిద్రను ఇస్తుంది. ( నోట్ : పై సమాచారం, ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగినది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)



