ఎవ్వరికీ బహుమతిగా ఇవ్వకూడని ఐదు వస్తువులు ఇవే!
స్నేహితులకు లేదా బంధువులకు బహుమతులు ఇవ్వడం అనేది కామన్. అయితే ఇలా బహుమతులు ఇవ్వడం మంచిదే అయినప్పటికీ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల బహుమతులు అస్సలే ఇవ్వకూడదంట. దీని వలన బంధుత్వం చెడిపోయే ప్రమాదం ఉన్నదంట. కాగా, ఎలాంటి వస్తువులు ఇవ్వకూడదో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jul 21, 2025 | 4:52 PM

స్నేహితులకు లేదా బంధువులకు బహుమతులు ఇవ్వడం అనేది కామన్. అయితే ఇలా బహుమతులు ఇవ్వడం మంచిదే అయినప్పటికీ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల బహుమతులు అస్సలే ఇవ్వకూడదంట. దీని వలన బంధుత్వం చెడిపోయే ప్రమాదం ఉన్నదంట. కాగా, ఎలాంటి వస్తువులు ఇవ్వకూడదో ఇప్పుడు చూద్దాం.

కొంత మంది బూట్లు లేదా చెప్పులను బహుమతిగా ఇచ్చుకుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది అస్సలే మంచిది కాదని చెబుతున్నారు వాస్తునిపుణులు. దీని వలన మీ బంధం ముగిసిపోయే ప్రమాదం ఉందని, అందుకే ఎట్టి పరిస్థితుల్లో పాదరక్షలను బహుమతిగా ఇవ్వకూడదంట.

అదే విధంగా నల్లటి వస్త్రాలు లేదా నలుపు రంగుతో కూడినవి బహుమతిగా ఇవ్వకూడదంట. ఎందుకంటే నల్లటి దుస్తులు ప్రతికూలతతో ముడిపడి ఉంటాయి. శుభ సమయంలో ఇలాంటివి ఇవ్వడం వలన వ్యక్తిరేకత పెరిగే ఛాన్స్ ఉన్నదంట. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ నల్లటి దుస్తులను బహుమతిగా ఇవ్వకూడదంట.

కొంత మంది తమ స్నేహితులు లేదా బంధువులకు మహాభారతం పుస్తకాన్ని బహుమతిగా ఇస్తుంటారు. కానీ దీనిని కూడా ఇవ్వకూడదంట. ఈ గ్రంథాన్ని బహుమతిగా ఇవ్వడం వలన ఇది ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని లేదా ,బంధుత్వాన్ని చెడగొట్టే ప్రమాదం ఉన్నదంట. అందుకే ఎట్టిపరిస్థితుల్లో మహాభారత పుస్తకాన్ని గిఫ్ట్‌గా ఇవ్వకూడదంట.

అలాగే కొంత మంది పుట్టిన రోజు సమయంలో దేవతల విగ్రహం లేదా దేవతల ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్‌గా ఇస్తుంటారు. కానీ ఇది నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తుందని చెబుతున్నారు జ్యోతిష్యులు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దేవతల విగ్రహాలను బాగా చూసుకుంటారని చెప్పలేం. కొందరు వాటిని పట్టించుకోరు. అది మంచిది కాదు. అందుకే దేవతల విగ్రహాలు బహుమతిగా ఇవ్వకూడదంట.