- Telugu News Photo Gallery Super Health Benefits of Ragi Java at Summer, check here is details in Telugu
Ragi Java Benefits: వేసవిలో రాగి జావ తాగితే ఎన్ని బెనిఫిట్సో తెలుసా..
రాగి జావ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. రాగి జావను వివిధ ప్రాంతాల్లో అనేక పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. రాగి జావ తాగడం వల్ల శరీరం అనేది చల్లబడుతుంది. అందులోనూ ప్రస్తుతం సమ్మర్ సీజన్ కాబట్టి.. అతిగా దాహం వేస్తుంది. కాబట్టి రాగి జావ తాగడం చాలా మంచిది. వేసవిలో ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురికావడం, వడ దెబ్బ బారిన పడుతూ ఉంటారు. ఈ సమస్యల నుంచి బయట పడేలా..
Updated on: Mar 04, 2024 | 7:20 PM

రాగి జావ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. రాగి జావను వివిధ ప్రాంతాల్లో అనేక పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. రాగి జావ తాగడం వల్ల శరీరం అనేది చల్లబడుతుంది. అందులోనూ ప్రస్తుతం సమ్మర్ సీజన్ కాబట్టి.. అతిగా దాహం వేస్తుంది. కాబట్టి రాగి జావ తాగడం చాలా మంచిది.

వేసవిలో ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురికావడం, వడ దెబ్బ బారిన పడుతూ ఉంటారు. ఈ సమస్యల నుంచి బయట పడేలా.. రాగి జావ చేస్తుంది. ఇది తాగడం వల్ల హుషారుగా శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. శరీరంలో ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి.

రాగుల్లో క్యాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. పాలు తాగలేని వారు రాగి జావ తాగితే.. ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. అంతే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

డయాబెటీస్‌తో బాధ పడేవారు సైతం రాగి జావను ఎలాంటి సందేహం లేకుండా తాగవచ్చు. ఇది తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. అంతే కాకుండా రక్త హీనత సమస్య ఉన్నావారు ఇది తాగితే.. మంచి ఫలితం ఉంటుంది.

అంతే కాకుండా రాగుల్లో డైటరీ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది పొట్టను ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీని వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు. అంతే కాకుండా ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు కూడా అదుపులోకి వస్తాయి.




