- Telugu News Photo Gallery Summer Destination: ranthambore national park tourist places know here in telugu
సాహసం అంటే ఇష్టమా.. వేసవి సెలవుల్లో కుటుంబంతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. రణథంబోర్ బెస్ట్ ఎంపిక..
వేసవిలో సరదాగా గడపడం కోసం ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. కొంతమంది అందమైన పర్యాటక కేంద్రాలను సందర్శించాలనుకుంటే మరికొందరు ఆధ్యాత్మిక క్షేత్రాలకు, సాహసయాత్ర చేయాలనీ కోరుకుంటారు. అయితే సాహస యత్రాలతో పాటు కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయాలనుకుంటే మన దేశంలో బెస్ట్ ఎంపిక రణతంబోర్. ఇక్కడికి చేరుకోవాలంటే పెద్దగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉండదు.
Updated on: May 15, 2024 | 3:49 PM

రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో ఉన్న రణతంబోర్ వినోదం, కుటుంబ పర్యటనలకు గొప్ప ప్రదేశం. జైపూర్ నుంచి సవాయి మాధోపూర్ సమీపంలో ఉంది. ఒక రోజులో రణతంబోర్ ను సులభంగా సందర్శించవచ్చు.

1980లో దీనిని రణథంబోర్ నేషనల్ పార్క్‌గా మార్చారు. ఇంతకు ముందు ఈ అడవిలో చాలా పులులు ఉండేవి. వీటిని వేటాడేందుకు రాజులు, చక్రవర్తులు కూడా ఇక్కడికి వెళ్తూ ఉండేవారట. అయితే తర్వాత పులుల సంఖ్య తగ్గడంతో పులుల వేట ఆగిపోయింది. రణథంబోర్ భారతీయులకే కాదు విదేశీ పర్యాటకులకు కూడా ఇష్టం. ఇక్కడ ఏయే ప్రదేశాలను సందర్శించవచ్చునో ఈ రోజు తెలుసుకుందాం..

రణతంబోర్ కోట: మీరు రణతంబోర్ కోటను కూడా సందర్శించవచ్చు. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఈ కోట రణతంబోర్ నేషనల్ పార్క్ లోపల ఉంది. ఇది 944 BC లో నిర్మించబడింది. స్వాతంత్ర్యానికి ముందు ఈ కోట జైపూర్ రాజకుటుంబానికి చెందింది.

త్రినేత్ర గణేష్ ఆలయం: రణతంబోర్ కోటలో ఒక పురాతన దేవాలయం ఉంది. భారతదేశంలో వినాయకుని విగ్రహానికి మూడు కళ్ళు ఉన్న ఏకైక ఆలయం ఇదే. అతనితో పాటు, అతని ఇద్దరు భార్యలు బుద్ధి, సిద్ధి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత విశేషమేమిటంటే ఏదైనా శుభకార్యం, ప్రారంభోత్సవాలు జరగడానికి ముందు, ఆహ్వాన పత్రికలు పోస్ట్ ద్వారా పంపిస్తారు.

జోగి మహల్: వాస్తవానికి జోగి మహల్ పూర్వ కాలంలో రాజ కుటుంబాల సభ్యులు నివసించే విశ్రాంతి స్థలం. రాజకుటుంబానికి చెందిన వారు వేట తర్వాత ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారు. ఇది చాలా చిన్న ప్యాలెస్ అయినా అందం పరంగా ఏ కోటకు తక్కువ కాదు.

రణతంబోర్ ఎలా చేరుకోవాలంటే: ఢిల్లీ నుంచి జైపూర్ వరకు రైలు లేదా విమానంలో వెళ్ళవచ్చు. ఇక్కడ నుంచి మీరు రైలులో సవాయి మాధోపూర్ వెళ్ళవచ్చు. జైపూర్ నుండి దాదాపు 180 కిలోమీటర్లలో ఉంది. ఇక్కడ నుంచి రణతంబోర్ కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ ప్రాంతం సందర్శనకు మంచి సమయం.





























