Rajeev Rayala |
Updated on: May 15, 2024 | 2:52 PM
సినీ సెలబ్రెటీలు చాలా మంది అనారోగ్యానికి గురవుతూ ఉంటారు . సమంత అనారోగ్యంకు గురైనప్పుడు చాలా మంది బాధపడ్డారు. అలాగే ఇప్పుడు ఓ బాలీవుడ్ హీరోయిన్ కూడా అనారోగ్యానికి గురైందని తెలుస్తోంది.
బాలీవుడ్ బ్యూటీ శిల్ప శెట్టి సోదరి షమితా శెట్టి తాజాగా హాస్పటల్ లో చేరారు. ఆమె హాస్పటల్ బెడ్ పై ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.
ఈ వీడియోను శిల్ప శెట్టి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అసలు షమితా శెట్టికి ఏమైంది.? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గర్భాశయంలో సమస్యతో షమితా హాస్పటల్ లో జాయిన్ అయ్యింది.
మహిళలకు సాధారణంగా వచ్చే సమస్యే ఇది. గర్భాశయంలో చాలా నొప్పిగా అనిపిస్తుంది. అలాంటి సమస్య ఇప్పుడు తనకు వచ్చింది. దాదాపు 40 శాతం మంది మహిళలు ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు అని తెలిపింది షమితా..
షమితా తెలుగులో ఒకేఒక్క సినిమా చేసింది .. ఆకాష్ హీరోగా నటించిన పిలిస్తే పలుకుతా అనే సినిమాలో నటించింది షమితా శెట్టి. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ బిగ్ బాస్ గేమ్ షోలో కూడా పాల్గొంది.