- Telugu News Photo Gallery Spiritual photos Two maha yogas: These are lucky zodiac signs details in Telugu
Maha Yogas: రెండు మహా యోగాలు.. ఈ రాశుల వారు అదృష్టవంతులయ్యే ఛాన్స్.. !
ఈ నెల(ఆగస్టు) 17, 18, 19 తేదీల్లో గ్రహ సంచారంలో రెండు మహా యోగాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మూడు రోజుల్లో చంద్ర, గురువులు కలిసి ఉండడం వల్ల గజకేసరి యోగం, చంద్ర, బుధులకు పరివర్తన యోగం పట్టడం వల్ల కొన్ని రాశులకు ఒకేసారి రెండు మహా యోగాలు కలుగుతున్నాయి. బుధుడికి చెందిన మిథున రాశిలో చంద్రుడు, చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో బుధుడి సంచారం వల్ల ఈ పరివర్తన యోగం ఏర్పడింది. ఆదాయం బాగా పెరగడం, మనసులోని కోరికలు నెరవేరడం, అనుకున్న పనులన్నీ పూర్తి కావడం, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావడం వంటివి జరుగుతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారు అదృష్టవంతులయ్యే అవకాశం ఉంది.
Updated on: Sep 10, 2025 | 1:41 PM

వృషభం: ఈ రాశికి ధన స్థానంలో గజకేసరి యోగం పట్టడం వల్ల రాజపూజ్యాలు పెరుగుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు వృద్ది చెందుతాయి. ప్రముఖులతో, సంపన్నులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆకస్మికంగానూ, అప్రయత్నంగానూ ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి కలుగుతుంది. బుధ, చంద్రుల పరివర్తన వల్ల వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.

మిథునం: ఈ రాశికి గజకేసరి యోగం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇతర సంస్థల నుంచి ఆహ్వానాలు, ఆఫర్లు అందుతాయి. ప్రముఖులతో పరి చయాలు వృద్ది చెందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. జనాకర్షణ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒక వెలుగు వెలుగుతారు. రాశ్యధిపతి బుధుడికి, ధనాధిపతి చంద్రుడికి పరివర్తన జరిగినందువల్ల షేర్లు, స్పెక్యులేషన్లతో సహా ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి.

కన్య: ఈ రాశికి దశమ స్థానంలో చంద్ర, గురువుల కలవడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. సీనియర్ ఉద్యోగుల మీద కూడా విజయం సాధించి ఉన్నత పదవులు అందుకుంటారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఉత్తీ ర్ణులవుతారు. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. రాశ్యధిపతి బుధుడు లాభాధిపతి చంద్రుడితో పరివర్తన చెందడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది.

తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉద్యోగులకు పదవీ యోగం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. తండ్రి వైపు నుంచి ఆస్తి లేదా సంపద కలిసి వస్తుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చంద్ర, బుధుల పరివర్తన వల్ల ఆదాయం బాగా వృద్ది చెందే అవకాశం ఉంది.

మకరం: ఈ రాశికి ఆరవ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెంది, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆదాయ వృద్ది ప్రయత్నాల మీద ఈ మూడు రోజుల్లో బాగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు జోరందుకుంటాయి. బుధ, చంద్రుల పరివర్తన వల్ల ధన యోగాలు, రాజపూజ్యాలు కలుగుతాయి.

మీనం: ఈ రాశికి చతుర్థ స్థానంలో గురు, చంద్రుల కలయిక వల్ల ఆస్తి లాభం, భూలాభం, గృహ లాభం కలిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా, జీత భత్యాలు పెరుగుతాయి. చంద్ర, బుధుల మధ్య పరివర్తన జరగడం వల్ల షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది.



