- Telugu News Photo Gallery Spiritual photos These Vastu problems can cause sleep disturbance at night
వాస్తు టిప్స్ : రాత్రి పూట సరిగ్గా నిద్ర పట్టడం లేదా?
నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరూ తప్పకుండా కనీసం 8 గంటలు నిద్రపోవాలి అంటారు. కానీ కొంత మంది ఒత్తిడి, కుటుంబ సమస్యల వలన ఎక్కుగా నిద్ర పోరు. కానీ ఇంకొంత మంది మాత్రం ఎలాంటి టెన్షన్ లేకున్నా తమ ఇంటిలో ఆనందంగా నిద్రపోరు దానికి ముఖ్య కారనం వాస్తు దోషాలంటున్నారు నిపుణులు. కాగా, ఎలాంటి వాస్తు దోషాలు ఉంటే రాత్రి సమంలో సరిగ్గా నిద్ర పట్టదో ఇప్పుడు చూద్దాం.
Updated on: Nov 06, 2025 | 1:14 PM

అయితే మీకు గనుక రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టకపోతే తప్పకుండా మీ బెడ్ రూమ్ విషయంలో వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయో లేదో చూసుకోవాలంట. ఏ వస్తువులు ఏ ప్రదేశంలో ఉన్నాయి. బెడ్స్ సరైన దిశలో ఉన్నాయా లేదా? చూసుకోవాలంట. దీని వలన మీకు ఎలాంటి వాస్తు దోషాలు ఉండవంట.

ఇక బెడ్ రూమ్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దం ఉంచకూడదంట. బెడ్ రూమ్‌లో అద్దం ఉంటే వాస్తు సమస్యలు చుట్టు ముట్టే ప్రమాదం ఉంది. అంతే కాకుండా, ఇది మీ నిద్రకు భగం కలిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

చాలా మంది తెలిసి తెలియక బెడ్ రూమ్‌లోనే తింటుంటారు. కానీ బెడ్ రూమ్‌లో తినడం వాస్తు శాస్త్రం ప్రకారం అస్సలే మంచిది కాదంట. దీని వలన వాస్తు ప్రభావం మీ ఇంటి పై చాలా ఉండే ఛాన్స్ ఉన్నదంట. అందువలన రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టకపోవడం, నిద్ర పోవడంలో ఇబ్బందులు తలెత్తడం జరుగుతుందంట. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం అస్సలే బెడ్ రూమ్‌లో అస్సలే తినకూడదంట.

అలాగే వాస్తు శాస్త్రం ప్రాకారం, బెడ్ రూమ్ కూడా ఎప్పుడూ ఈశాన్య దిశలో ఉంచడం సరికాదంట. ఈ శాన్య దిశలో మంచం ఉండటం వలన నిద్ర భగం కలుగుతుందంట. ఇది వాస్తు ప్రకారం కూడా అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.