- Telugu News Photo Gallery Spiritual photos Jupiter retrograde causes problems for people of three zodiac signs
సమస్యల వలయంలో ఈ మూడు రాశులు.. తప్పులు చేస్తే కష్టమే గురూ!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం లేదా గ్రహాల కలయిక, గ్రహాల తిరోగమనం అనేది చాలా కామన్. అయితే నవంబర్ నెలలో శక్తి వంతమైన బృహస్పతి గ్రహం తిరోగమనం చేయబోతుంది. ఇది పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపగా, నాలుగు రాశులపై మాత్రం వ్యక్తిరేక ప్రభావాన్ని చూపుతుంది. దీని వలన అనేక సమస్యలు ఎదురు అయ్యే చాన్స్ ఉన్నది.
Updated on: Nov 06, 2025 | 1:14 PM

నవంబర్ 11వ తేదీన బృహస్పతి గ్రహం తిరోగమనం చేయనుంది. డిసెంబర్ 5 వరకు తిరోగమనంలో ఉండనుంది. దీని వలన దీని ప్రభావం కొన్ని రాశులపై చాలా ప్రభావం పడుతుంది. అందువలన కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కూడా చేకూరితే మరికొన్ని రాశుల వారికి మాత్రం అనేక సమస్యలు పెరగనున్నాయి.

కుంభ రాశి : కుంభ రాశి వారికి ఇది అస్సలే మంచి సమయం కాదు అని చెప్పాలి. వీరికి ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉండటంతో చాలా ఇబ్బంది పడుతారు. అంతే కాకుండా వీరు ఏ సమయంలో ఎంత మంచి పనులు చేసినా చివరకు నిందలు పడాల్సి వస్తుంది. అలాగే వీరు ఈ సమయంలో ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది.

తుల రాశి : తుల రాశి వారికి కూడా ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని సమయంలో అప్పులు కూడా అధికం అవ్వడంతో తీవ్ర ఇబ్బంది పడుతారు. కష్టానికి తగిఫలితం లభించదు. ఆర్థిక సమస్యలతో ఈ రాశి వారు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు పండితులు.

కన్యా రాశి : కన్యా రాశి వారికి బృహస్పతి తిరోగమనం వలన అనేక సమస్యలు చుట్టు ముట్టే ప్రమాదం ఉన్నదంట. ముఖ్యంగా వీరు ఈ సమయంలో చాలా వరకు ఎంత తక్కువ మాట్లాడితే, అంత మంచిదని చెబుతున్నారు పండితులు. ఎందుకంటే? వీరు ఏది మాట్లాడినా, అనేక సమస్యలు వీరు ఎదుర్కొనే ఛాన్స్ ఉన్నదంట.

మిథున రాశి : గురు గ్రహం వలన మిథున రాశి వారికి కెరీర్ పరంగా చాలా సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నదంట. అంతే కాకుండా వీరికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.



