- Telugu News Photo Gallery Spiritual photos Mansarovar Lake: What is benefit of bathing in water of Mansarovar Lake in Life
Mansarovar Lake: బ్రహ్మ సృష్టించిన ఈ సరోవరంలో స్నానం చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
సాక్షాత్తు పరమ శివుడు కొలువైన కైలాస మానస సరోవర యాత్రను చేయడనికి హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. మానస సరోవరంలోని నీటిని కూడా అత్యంత హిందూ మతంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ సరోవరంలో స్నానం చేయడం లేదా శరీరంపై చల్లుకోవడం వల్ల భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధి, పాపాల నుంచి విముక్తి లభించి చివరకు జీవికి మోక్షం లభిస్తుందని నమ్మకం. ఇలా చేయడం కైలాస మానస సరోవర యాత్రలో అంతర్భాగం. చాలా ముఖ్యమైన భాగం.
Updated on: Jun 25, 2025 | 2:44 PM

కైలాస పర్వతం సమీపంలో ఉన్న మానసరోవర సరస్సు హిందూ మతం, బౌద్ధమతం, జైన మతం, బోన్ మతం అనుచరులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఈ సరస్సులోని నీరు అమృతంతో సమానంగా పరిగణించబడుతుంది. ఈ సరోవరంలోని నీటిలో స్నానం చేయడం వల్ల ప్రజలకు అనేక ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. పౌరాణిక, మత విశ్వాసాలలో ప్రస్తావించబడిన మానసరోవర సరస్సు నీటిలో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

పాప నాశనం , శుద్ధి: మానస సరోవరంలోని పవిత్ర జలంలో స్నానం చేయడం ద్వారా ఒక వ్యక్తి చేసిన జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని, అతను తెలిసి లేదా తెలియకుండా చేసిన అన్ని తప్పు పనుల నుంచి విముక్తి పొందుతాడని నమ్ముతారు. ఈ స్నానం శరీరం , ఆత్మ రెండింటినీ శుద్ధి చేస్తుంది, దీని కారణంగా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక స్వచ్ఛతను అనుభవిస్తాడు.

మోక్షప్రాప్తి: హిందూ మతంలో మానసరోవర సరస్సు నీటిలో స్నానం చేయడం మోక్ష మార్గంలో (జీవన మరణ చక్రం నుండి విముక్తి) ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతుంది. ఇది ఒక వ్యక్తిని పునర్జన్మ బంధం నుంచి విముక్తి చేయడంలో సహాయపడుతుంది. మానసరోవరంలో ఒకసారి స్నానం చేసినా.. ఆ వ్యక్తికీ చెందిన ఏడు తరాలకు విముక్తిని ఇస్తుందని శివ పురాణంలో ప్రస్తావించబడింది.

మానసిక ప్రశాంతత, స్థిరత్వం: మానస సరోవర సరస్సును బ్రహ్మ దేవుడు స్వయంగా సృష్టించాడని నమ్ముతారు. దీనిని మనస్సు యొక్క సరస్సు (మానస + సరోవర) అని కూడా పిలుస్తారు. ఈ సరోవరంలొని నీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.ఈ స్పష్టమైన నీటిలో, కైలాస పర్వతం దగ్గర ప్రశాంతమైన వాతావరణంలో స్నానం చేయడం లేదా ధ్యానం చేయడం వల్ల మనసుకు అపారమైన శాంతి, స్థిరత్వం లభిస్తుంది. ఇది దురాశ, అనుబంధం, అహంకారం, కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

దేవుడి ఆశీర్వాదం, ఆరోగ్యం: బ్రహ్మ ముహూర్త సమయంలో దేవీ దేవతలు స్వయంగా ఈ సరస్సులో స్నానం చేయడానికి వస్తారని నమ్ముతారు. ఈ నీటిలో స్నానం చేయడం వల్ల దేవుడి ఆశీస్సులు లభిస్తాయి. కొన్ని నమ్మకాల ప్రకారం మానససరోవర సరస్సు నీటిని తాగడం వల్ల ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. వ్యాధులకు దూరంగా ఉంటాడు. అయితే త్రాగడానికి ఎల్లప్పుడూ స్వచ్ఛమైన, సురక్షితమైన నీటిని ఉపయోగించాలి. మానససరోవర పవిత్ర జలంలో స్నానం చేయడం వల్ల శరీరం , మనస్సు నుంచి ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. సానుకూల శక్తి ప్రసారం అవుతుంది.

అయితే 2018 నుంచి చైనా ప్రభుత్వం మానసరోవర సరస్సులో నేరుగా స్నానం చేయడాన్ని నిషేధించింది. సరస్సు పవిత్రత, పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి అలాగే ప్రయాణికుల భద్రత కోసం ఈ నిషేధం విధించబడింది. ఎందుకంటే ఈ సరస్సులోని నీరు చాలా చల్లగా ఉంటుంది. దీంతో నేరుగా సరస్సులోకి దిగి స్నానం చేయడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అయినప్పటికీ భక్తులు ఈ సరస్సులోని నీటిని స్నానం చేసే అవకాశం ఉంది. ఇప్పటికీ బకెట్లతో సరస్సు నీటిని భక్తులు స్నానం చేసేందుకు ఇస్తారు. ఈ నీటితో సరస్సులోకి దిగకుండానే స్నానం చేయడానికి ఉపయోగించుకోవచ్చు. లేదా శుద్ధి చేయడానికి ఉపయోగించవచ్చు. అందువల్ల ఈ నీటిని ఉపయోగించడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలను ఇప్పటికీ పొందవచ్చు.




