- Telugu News Photo Gallery Spiritual photos Can we keep the Garuda Purana at home? What do scholars say?
Garuda Purana: గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా.? పండితులు ఏం అంటున్నారంటే.?
గరుడ పురాణం హిందూ మతంలోని 18 ప్రధాన పురాణాలలో ఒకటి. ఇది ప్రధానంగా మరణం తరువాత ఆత్మ ప్రయాణం వివరణాత్మక వర్ణనకు ప్రసిద్ధి చెందింది. ఇందులో ఆచారాలు, పాపాలకు శిక్షలు ఉన్నాయి. మరి గరుడ పురాణం ఇంట్లో ఉంచవచ్చా.? పండితులు ఏమంటున్నారు.? ఈరోజు ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం రండి..
Updated on: Jul 02, 2025 | 10:45 AM

గరుడ పురాణం.. హిందూ సంప్రదాయంలో ఉన్న 18 ప్రధాన పురాణాలలో ఒకటి. ఇది మరణం తర్వాత జరిగే విషయాలను వివరిస్తుంది. ఇందులో మరణాంతరం భువి నుంచి నరకం వరకు ఆత్మ ప్రయాణం, ఆత్మ సంచరించే అనంతలోక నగరాలు, భూమిపై జీవించి ఉన్నప్పుడు మానవులు చేసిన తప్పులకు నరకంలో విధించే శిక్షలు గురించి తెలియజేస్తుంది.

గరుడ పురాణం చదవడం వల్ల ఒకరి చర్యల పరిణామాలను అర్థం చేసుకోవడానికి, హిందూ విశ్వాసాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. నరకం గురించి ముందే తెలియడంతో పాపాలు చేయకుండా జాగ్రత్త పడతారు.

గరుడ పురాణం అంత్యక్రియల సమయంలో ఎక్కువగా పారాయణం చేస్తూ ఉంటారు. దీంతో మరణ ఆచారాలతో ముడిపెట్టడం వల్ల దానిని అంత్యక్రియల సమయంలో మాత్రమే చదవాలనే అపోహ ఏర్పడింది. అయితే, ఇది మతపరమైన పరిమితి కాదు. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మీకు కుదిరినప్పుడల్లా చదువుకోవచ్చు అంటున్నారు పండితులు.

గరుడ పురాణాన్ని ఇంట్లో చదవడం లేదా ఉంచుకోవడం నిషేధించే మతపరమైన గ్రంథాలు ఏవీ లేవు. కావున మీరు గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవడంలో ఎలాంటి ఇబ్బందు లేదు. నిర్భయంగా మీ ఇంట్లో గరుడ పురాణం ఉంచుకొని రోజుకి ఒక అధ్యయనం చేసుకోవచ్చు.

గరుడ పురాణం జననం, మరణం, పునర్జన్మ చక్రం గురించి వివరంగా తెలియజేస్తుంది. ఇది హిందూ తత్వశాస్త్రం, నైతికతను అర్థం చేసుకోవడానికి విలువైనదిగా ఉంటుంది. మీరు కూడా గరుడ పురాణం ఒకటి తీసుకొని చదవండి. ఆధ్యాత్మిక జ్ఞానన్నీ పెంచుకోండి.




