- Telugu News Photo Gallery Spiritual photos According to Vastu Shastra, these are the things that should not be taken from others
వాస్తు టిప్స్ : ఈ వస్తువులు అరువు తీసుకున్నారో, కష్టాలు తప్పవు!
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. లేకపోతే అనేక రకాల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అయితే చాలా మంది పక్కింటి వారి నుంచి కొన్ని రకాల వస్తువులు అరువు తీసుకుంటారు. కానీ కొన్ని రకాల వస్తువులను మాత్రం అస్సలే అరవు తెచ్చుకోకూడదని చెబుతున్నారు పండితులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Aug 10, 2025 | 5:55 PM

వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పును ఎట్టిపరిస్థితుల్లో అరువు తీసుకొచ్చుకోకూడదంట. ఇది సంపద, లక్ష్మీ దేవికి చిహ్నం. అయితే దీనిని అరువు తెచ్చుకోవడం వలన శని దోషం పెరుగుతుందంట. దీని వలన తరచూ అనారోగ్య సమస్యలు, డబ్బు కోల్పోవడం వంటి సమస్యలు ఎదురు అవుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

పెరుగుని కూడా అరువు తెచ్చుకోకూడదంట.చాలా మంది ఇరుగు పొరుగు వారి నుంచి ఎక్కువగా పెరుగును అరువు తీసుకొచ్చుకుంటారు. కానీ ఇది కూడా ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట. దీని వలన ఆర్థిక సమస్యలు, ఇంట్లో మనశ్శాంతి కరువు అవ్వడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయంట.

నల్లనువ్వులను ఎట్టి పరిస్థితుల్లో అరువుగా తీసుకొచ్చుకోరాదంట. దీని వలన జీవితంలో అనేక అడ్డంకులు ఎదురు అవుతాయని చెబుతన్నారు వాస్తు శాస్ర నిపుణులు. ఎందుకంటే నల్ల నువ్వులు అనేవి రాహువు, కేతువు, శని గ్రహాలతో సంబంధం కలిగి ఉంటాయి. అందువలన వీటిని అరువుగా తీసుకొచ్చుకోవడం వలన ఇవి మానసిక ఒత్తిడిని పెంచుతుందంట.

చాలా మంది ఎక్కువగా అరవు తీసుకొనే దాంట్లో అగ్గిపెట్ట ఉంటుంది. అయితే పండితులు మాత్రం అగ్నికి సంబంధించిన ఏ వస్తువులను అరవు తీసుకోకూడదు. దీని వలన పాజిటివ్ శక్తి తగ్గిపోయి, ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అగ్గిపెట్ట అరవుగా వేరకొరికి ఇంటిలోకి తీసుకొచ్చుకోకూడదని చెబుతున్నారు పండితులు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడూ కూడా ఒకరి టవల్ మరొకరు తీసుకోకూడదంట. ఇది ఒక వ్యక్తి వ్యక్తిగత వస్తువుగా పరిగణించబడుతుంది కాబట్టి, దీనిని వేరొకరు తీసుకోవడం వలన ఇది ఇద్దరి మధ్య విభేదాలకు కారణం కావచ్చు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు



