తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. వీటిని పెరుగుతో కలిపి అప్లైచేయండి.. వారంలో మ్యాజిక్
మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా జనాలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో ఒకటి జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు జనాలు అనేక ప్రయత్నాలు చేస్తా, ఎంతో డబ్బు ఖర్చు చేస్తారు. కానీ పూర్తి ఫలితాన్ని పొందలేరు. కానీ మన పూర్వికుల నుంచి ఉపయోగిస్తున్న కొన్ని చిట్కాలను వాడడం వల్ల ఈ సమస్యను త్వరగా నయం చేయవచ్చని చాలా మందికి తెలియద. కాబట్టి అదేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం
Updated on: Oct 16, 2025 | 10:11 AM

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రధాన సమస్య, జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం. తెల్లబడిన జుట్టును నల్లగా మార్చుకోవాలనుకునే, పొడవాటి, మందపాటి జుట్టును పొందాలనుకునే వారికి అమ్మమ్మల కాలం నాటి ఒక చిట్కా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ రోజుల్లో, మార్కెట్లో లభించే చౌకైన షాంపూలను ఉపయోగించడం వల్ల జుట్టు త్వరగా బూడిద రంగులోకి మారుతోంది. అలాగే జుట్టు రాలడానికి కూడా కారణమవుతోంది. అయితే, రసాయనాలతో కూడిన షాంపూలకు బదులుగా షీకాకైతో మీ జుట్టును నల్లగా మర్చుకోవచ్చు దీనిలోని సహజ పదార్థాలు మీ జుట్టును మృదువుగా చేస్తాయి, అందమైన మెరుపును ఇస్తాయి.

సాధారణంగా ఉపయోగించే సహజ పదార్ధాలలో ఒకటైన ఈ మొక్కను భారతదేశంలోని చాలా ప్రాంతాలలో పురాతన కాలం నుండి జుట్టు శుభ్రపరిచే మందుగా ఉపయోగిస్తున్నారు. శికాకైలో విటమిన్ సి, డి ఉన్నాయి, వీటితో పాటు జుట్టు సంరక్షణకు అనువైన ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి.

శికాకాయ నిజానికి బూడిద జుట్టు కనిపించడాన్ని నెమ్మదిస్తుంది. మీ జుట్టు సహజ యవ్వనాన్ని ఎక్కువ కాలం నిలుపుతుంది. అలాగే ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. ఫలితంగా జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది, జుట్టు రాలడం తగ్గుతుంది. దీని కోసం షికాకాయను పొడిగా చేసుకొని దాన్ని పెరుగులో కలిపి మీ జుట్టుకు అప్లై చేసుకోండి.

దీని కోసం మీరు షీకాకాయ పొడిని, పెరుగుతో కలిసి ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేసుకోండి. అలాగే 15-20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా ప్రతి రోజు ప్రత్యామ్నాయంగా చేయండి, ఒక వారంలోనే ఫలితాలను చూడండి. (NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కొరకు మాత్రమే తెలుపబడినవి.. వీటిని ప్రయత్నించే ముందు మీరు కచ్చితంగా వైద్యులను సంప్రదించండి)




