- Telugu News Photo Gallery Relationship advice for Men and Women, know these 5 effective ways to build intimacy
Relationship Tips: శృంగారంలో అదే ముఖ్యమట.. పురుషులు, మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఐదు కీలక విషయాలు..
ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది లైంగిక పరమైన సమస్యలతో బాధడుతున్నారు. అయితే, లైంగిక సమస్యలకు ప్రధాన కారణం ఒకరినొకరు అర్ధం చేసుకోకపోవడం, సాన్నిహిత్యంగా లేకపోవడం.. శృంగార సంబంధాలలో ప్రధాన అవసరం.. సాన్నిహిత్యం.. భాగస్వామి భావాలను, అవసరాలను బాగా అర్థం చేసుకోవడానికి సాన్నిహిత్యం చాలా సహాయపడుతుంది. నేటి తరంలో భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పంచుకోవడం కంటే డిజిటల్ బంధాలను ఏర్పరచుకోవడం చాలా ముఖ్యమైనదిగి పరిగణిస్తున్నారు. ప్రతి సంబంధానికి బలమైన బంధంలా మార్చుకోవడానికి ఒక స్థాయిలో సాన్నిహిత్యం అవసరం.
Updated on: May 08, 2023 | 9:31 PM

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది లైంగిక పరమైన సమస్యలతో బాధడుతున్నారు. అయితే, లైంగిక సమస్యలకు ప్రధాన కారణం ఒకరినొకరు అర్ధం చేసుకోకపోవడం, సాన్నిహిత్యంగా లేకపోవడం.. శృంగార సంబంధాలలో ప్రధాన అవసరం.. సాన్నిహిత్యం.. భాగస్వామి భావాలను, అవసరాలను బాగా అర్థం చేసుకోవడానికి సాన్నిహిత్యం చాలా సహాయపడుతుంది. నేటి తరంలో భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పంచుకోవడం కంటే డిజిటల్ బంధాలను ఏర్పరచుకోవడం చాలా ముఖ్యమైనదిగి పరిగణిస్తున్నారు. ప్రతి సంబంధానికి బలమైన బంధంలా మార్చుకోవడానికి ఒక స్థాయిలో సాన్నిహిత్యం అవసరం.

తీవ్రమైన షెడ్యూల్, తక్కువ సమయం, ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవనశైలి కారణంగా భాగస్వామితో లోతైన సంభాషణను పంచుకోవడం కూడా కష్టమవుతోందని చాలా మంది పేర్కొంటున్నట్లు మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. సాంకేతికత, సులభమైన కమ్యూనికేషన్ సాధనాలు సంభాషణలను పంచుకోవడాన్ని సులభతరం చేశాయి కానీ అవి సాన్నిహిత్యంగా పరిగణించలేమంటున్నారు.

అందువల్ల, మీ శృంగార బంధంలో సాన్నిహిత్యాన్ని పెంపొందించడానికి, దానిని దృఢంగా చేయడానికి మేము మీకు కొన్ని ప్రభావవంతమైన మార్గాలను అందిస్తున్నాము. అవేంటో ఓ లుక్కెయండి..

కమ్యూనికేషన్: భాగస్వామితో ముఖాముఖి, నిజాయితీతో కూడిన సంభాషణ సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. సంబంధాన్ని మరింత బలపరిచేలా చేస్తుంది. సాన్నిహిత్యాన్ని పెంపొందించడానికి ఇది ఒక ముఖ్యమైన దశ. ఒకరికొకరు బలహీనతలను బహిర్గతం చేయడం.. భయాలు, జ్ఞాపకాలను పంచుకోవడం మీ సంబంధాన్ని మరింతగా పెంచుతుంది.

ఫిజికల్ టచ్: కౌగిలింతలు, ముద్దులు, చేతులు పట్టుకోవడం వంటి సన్నిహిత లేదా శారీరక స్పర్శ శరీరంలో ప్రేమ, అనుబంధ భావాలను ప్రోత్సహించే హార్మోన్లను విడుదల చేస్తాయి. మీ బంధంలో మరింత సాన్నిహిత్యాన్ని కొనసాగించడానికి యాదృచ్ఛిక స్పర్శలు ప్రభావవంతమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.

అభిరుచులను పంచుకోవడం: ప్రయాణం, పెయింటింగ్, వంట వంటి అభిరుచులను పంచుకోవడం వలన మీరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపవచ్చు. ఒకరినొకరు మంచి మార్గాల్లో ఎదుటివారిని అర్థం చేసుకోవచ్చు. ఈ అనుభవాలు అందమైన జ్ఞాపకాలను సృష్టించడమే కాకుండా.. మీ ఇద్దరికీ ఒకే విధమైన ఆసక్తి పెంపొందించి భావోద్వేగ బంధాన్ని పంచుకోవడానికి అనుమతిస్తాయి.

ఒకరినొకరు మద్దతునిచ్చుకోవడం: బంధంలో ఇది చాలా ముఖ్యమైన అంశం. జీవితంలోని ఒడిదుడుకులు ఒత్తిడి మనల్ని బాధలో ముంచెత్తుతాయి. అలాంటి సమయాల్లో, మీ భాగస్వామి పట్ల సానుభూతితో మీ భావోద్వేగ మద్దతును అందించడం దీర్ఘకాలిక సంబంధాన్ని నిర్మించడంలో చాలా కాలంపాటు దోహదపడుతుంది. వారికి నచ్చిన పనులను చేయమని ప్రోత్సహించడం.. వారికి మద్దతునివ్వడం.. మరింత ప్రేమ కురిపించడం లాంటివి దాంపత్య జీవితాన్ని మరింత ఆనందమయంగా మార్చుతాయి.

సమయం కేటాయించడం: మీ తీవ్రమైన షెడ్యూల్‌ల నుంచి సమయాన్ని వెచ్చించడం.. ఒకరితో ఒకరు గడపడం వలన భద్రత, విధేయత, విశ్వాసం భావాలను పెంచడంలో సహాయపడుతుంది. ఈ సన్నిహిత సమయం ఒకరితో ఒకరు లోతైన స్థాయిలలో కనెక్ట్ అవ్వడానికి, ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి, భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మీకు సహాయం చేస్తాయి.

వాస్తవానికి శృంగార జీవితం సాన్నిహిత్యం మీద ఆధారపడి ఉంటుందని.. దీనిలో ఈ విషయాలు కీలక పాత్ర పోషిస్తాయని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.




