చాలామంది స్పైసీ ఫుడ్ చాలా ఇష్టంగా తింటారు. కారంగా అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల కడుపు నొప్పి, వివిధ కడుపు సమస్యలు తలెత్తుతాయి. కాలేయం సమస్యలు కూడా వస్తాయి. దీని ప్రభావం ముఖంపైనా ప్రభావం చూపుతుంది. చాలామంది వేయించిన ఆహారాన్ని ఇష్టపడతారు. ఫ్రైడ్ ఫుడ్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫిష్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ వంటి ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల ఫ్రీ రాడికల్స్ సమస్య పెరుగుతుంది. ఇవి చర్మ కణాలను దెబ్బతీసి అకాల వృద్ధాప్యానికి కారణమవుతాయి.