- Telugu News Photo Gallery Business photos Punjab National Bank: Alert to customer these account will close in one month is your saving account safe
PNB: ఖాతాదారులను హెచ్చరించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు.. నెల రోజుల్లో ఖాతాలు మూసివేత
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కోట్లాది మంది ఖాతాదారులకు శుభవార్త. మీకు పీఎన్‌బీ బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతా ఉంటే, ముందుగా దాని స్థితిని తనిఖీ చేయండి. అలాంటి ఖాతాలను పీఎన్‌బీ ఒక నెలలో మూసివేయనుంది. ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాల గురించి బ్యాంకు తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అలాగే, గత మూడేళ్లుగా ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉంటే అలాంటి..
Updated on: May 12, 2024 | 5:40 PM

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కోట్లాది మంది ఖాతాదారులకు శుభవార్త. మీకు పీఎన్‌బీ బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతా ఉంటే, ముందుగా దాని స్థితిని తనిఖీ చేయండి. అలాంటి ఖాతాలను పీఎన్‌బీ ఒక నెలలో మూసివేయనుంది. గత 3 ఏళ్లలో ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాల గురించి బ్యాంకు తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అలాగే, గత మూడేళ్లుగా ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉంటే అలాంటి ఖాతాలను బ్యాంకు మూసివేయనుంది.

చాలా మంది స్కామర్లు కస్టమర్‌లు చాలా కాలంగా ఉపయోగించని ఖాతాలను దుర్వినియోగం చేస్తారు. ఇలాంటి కేసులను ఎదుర్కొనేందుకు బ్యాంకు ఈ పెద్ద అడుగు వేయనుంది. బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఖాతా లెక్కింపు ఏప్రిల్ 30, 2024 ఆధారంగా చేస్తోంది. ఈ తేదీ వరకు మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాలను మూసివేసేందుకు సిద్ధమవుతోంది.

గత 3 సంవత్సరాలుగా యాక్టివ్‌గా లేకుంటే, ఆ ఖాతాలన్నీ 1 నెల తర్వాత క్లోజ్ కానున్నాయని సదరు బ్యాంకు పేర్కొంది. గత మూడేళ్లలో బ్యాంక్ ఖాతా జీరోగా ఉన్న , ఎలాంటి కార్యకలాపాలు జరగని ఖాతాలు ఉన్న వారు అప్రమత్తం కావాల్సి ఉంటుంది.

బ్యాంకు డీమ్యాట్ ఖాతాలను మూసివేయదు. అంటే ఈ నియమం డీమ్యాట్ ఖాతాకు వర్తించదు. PNB బ్యాంక్ సుకన్య సమృద్ధి యోజన (SSY), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY), అటల్ పెన్షన్ యోజన (APY) వంటి పథకాలకు ఈ నిబంధనలు వర్తించవని తెలిపింది.

బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఖాతా నిష్క్రియంగా మారినట్లయితే, ఖాతాదారుడు ఖాతాను తిరిగి యాక్టివ్ చేయాలనుకుంటే అటువంటి ఖాతాదారులు శాఖకు వెళ్లి కేవైసీ ఫారమ్‌ను పూరించాలి. ఫారమ్‌తో పాటు, కస్టమర్ అవసరమైన పత్రాలను కూడా సమర్పించాలి. దీని తర్వాత వారి ఖాతా యాక్టివ్‌గా మారుతుంది. మరింత సమాచారం కోసం ఖాతాదారులు బ్యాంకును సందర్శించవచ్చు.





























