- Telugu News Photo Gallery Business photos Those countries are top in terms of economic stability in the world, Economically Stable Countries details in telugu
Economically Stable Countries: ప్రపంచంలో ఆర్థిక స్థిరత్వంలో ఆ దేశాలు టాప్.. జీడీపీ ఎంతో తెలిస్తే షాక్
ప్రపంచంలో చాలా దేశాలు ఉంటాయి. అయితే జీవన విధానాల్లో దేశాన్ని బట్టి తేడాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితిని మంచి జీవనానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక స్థిరత్వాన్ని అంచనా వేసుకునే ఆ దేశంలో ఉన్నత జీవన ప్రమాణాలు ఉంటాయి. ముఖ్యంగా మంచి పోలీస్ వ్యవస్థతో పాటు ఇతర అంశాలు ప్రశాంత జీవనంలో ముఖ్య భూమిక పోషిస్తాయి. అలాగే ఈ అంచనాను దేశ జీడీపీ ఆధారంగా నిర్ణయిస్తారు. కాబట్టి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక జీడీపీతో ఆర్థిక స్థిరత్వంతో కూడిన దేశాల గురించి ఓ సారి తెలుసుకుందాం.
Updated on: May 12, 2024 | 4:45 PM

స్విట్జర్‌లాండ్ ఆర్థిక స్థిరత్వం ఉన్న దేశాల్లో ముందు జాబితాలో ఉంది. ఇక్కడ జీడీపీ ఏకంగా 395 బిలియన్ డాలర్లుగా ఉంది. బలమైన బ్యాంకింగ్ రంగం, తక్కువ నిరుద్యోగ రేటు వంటి అంశాల వల్ల ఈ దేశంలో జీవన ప్రమాణాలు అధికంగా ఉంటాయి.

యునైటెడ్ అరెబ్ అమరేట్స్ ఆర్థిక స్థిరత్వం ఉన్న దేశాల్లో రెండో స్థానంలో ఉంది. ఈ దేశంలో జీడీపీ 579 బిలియన్ డాలర్లుగా ఉంది. యూఏఈలో వ్యాపార అనుకూల వాతావరణం ఉంటుంది. పర్యాటక పరిశ్రమ కారణంగా గ్రాండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌తో ఉంటుంది.

కెనడా దేశం జీడీపీ 2.14 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుంది. ఈ దేశంలో సహజమైన ప్రకృతి సౌందర్యం పర్యాటకులకు ఆకర్షిస్తుంది. స్థిరమైన రాజకీయ వ్యవస్థతో పాటు శ్రామిక శక్తి ఈ దేశ ప్రత్యేకతలుగా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ స్థిర జీవనం ఉంటుంది.

జపాన్‌లో అధునాతన సాంకేతిక రంగం స్థిర జీవినానికి హామీ ఇస్తుంది. సమర్థవంతమైన మౌలిక సదుపాయాాలు, బలమైన పారిశ్రామిక స్థావరంతో ప్రపంచంలోనే ఆర్థికంగా స్థిరమైన దేశాల్లో ఒకటిగా నిలుస్తుంది. జపాన్ దేశ జీడీపీ 4.23 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

జర్మనీ ఐరోపాలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంగా ఉంది. ఇక్కడ జీడీపీ 4.07 ట్రిలియన్ డాలర్స్‌గా ఉంటుంది. పారిశ్రామికంగా ముందుండే ఈ దేశంలో స్థిర జీవనాన్ని ప్రమాణం చేస్తుంది. మౌలిక సదుపాయాలతో పాటు అధునాతన వర్క్ ఫోర్ష్ ఈ దేశ ప్రత్యేకత.




