- Telugu News Photo Gallery Business photos You Can Transfer Money Without Internet, This Is The Easy Way
Transfer Money: ఇంటర్నెట్ లేకుండా కూడా డబ్బు బదిలీ చేయవచ్చు.. ఎలాగో తెలుసుకోండి..!
ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. గతంలో ఎవరికైనా డబ్బులు పంపాలంటే బ్యాంకుకు వెళ్లి అకౌంట్ ద్వారా పంపేవారు. ఇప్పుడు సాంకేతిక పెరిగిపోయిన కారణంగా ఆ సేవలన్ని ఇంట్లోనే ఉండి పొందుతున్నారు. అందుకు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు బ్యాంకు లావాదేవీలు సైతం చేసుకోవచ్చు. నేటి కాలంలో యూపీఐ చెల్లింపు చాలా మందికి..
Updated on: May 11, 2024 | 8:44 PM

ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. గతంలో ఎవరికైనా డబ్బులు పంపాలంటే బ్యాంకుకు వెళ్లి అకౌంట్ ద్వారా పంపేవారు. ఇప్పుడు సాంకేతిక పెరిగిపోయిన కారణంగా ఆ సేవలన్ని ఇంట్లోనే ఉండి పొందుతున్నారు. అందుకు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు బ్యాంకు లావాదేవీలు సైతం చేసుకోవచ్చు.

నేటి కాలంలో యూపీఐ చెల్లింపు చాలా మందికి అవసరంగా మారింది. ప్రజలు ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు యూపీఐ చెల్లింపులు చేయడం అలవాటు చేసుకున్నారు. అటువంటి పరిస్థితిలో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేని కారణంగా యూపీఐ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ సేవలను వినియోగించుకోవచ్చు.

ఈ సేవ ఎలా పని చేస్తుంది: 080 4516 3666 నంబర్‌ను నమోదు చేయాలి. హిందీ, ఇంగ్లీషుతో సహా 13 విభిన్న భాషల్లో యాక్సెస్ చేయవచ్చు. ఇది డబ్బు పంపడానికి, యూపీఐని మార్చడానికి, ఇంటర్నెట్ లేకుండా ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు దీన్ని ఎలా సెటప్ చేయవచ్చు, యూపీఐ చెల్లింపులను ఆఫ్‌లైన్‌లో ఎలా చేయవచ్చో తెలుసుకుందాం.మేము మీకు దశలవారీగా చెప్పబోతున్నాము.

ఆఫ్‌లైన్ యూపీఐ చెల్లింపులను సెటప్ చేయండి: మీ స్మార్ట్‌ఫోన్‌లో 080 4516 3666కు డయల్ చేయండి. మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన అదే ఫోన్ నంబర్‌ను ఉపయోగించి, మీ బ్యాంక్ ఖాతాల జాబితాను నమోదు చేయండిజ ఇప్పుడు మీ డెబిట్ కార్డ్‌లోని చివరి 6 అంకెలు, గడువు తేదీని మీరు విజయవంతంగా సెటప్ చేసిన తర్వాత మీరు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు.

ఆఫ్‌లైన్ యూపీఐ చెల్లింపు ఎలా చేయాలి?: మీ ఫోన్‌లో 080 4516 3666కు డయల్ చేయండి. అలాగే మీరు డబ్బు పంపాలనుకుంటున్న వ్యక్తి UPI ID/ఫోన్ నంబర్/బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేయండి యూపీఐ పిన్ ఎంటర్ చేయండి. మీరు ఈ సేవ ద్వారా గరిష్టంగా రూ.5,000 పంపవచ్చు.




