- Telugu News Photo Gallery Business photos Want to withdraw money from PF account in just 2 minutes? Here's how you can do this
PF Withdraw: కేవలం రెండు నిమిషాల్లోనే పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా.. ఎలాగో తెలుసుకోండి!
ప్రతి ఒక్క ఉద్యోగికి పీఎఫ్ అకౌంట్ చాలా ముఖ్యం. కంపెనీలు తమ ఉద్యోగులకు పీఎఫ్ అకౌంట్‌లో విరాళలు జమ చేస్తుంటుంది. అయితే పీఎఫ్ అకౌంట్ వారి వేతనం నుంచి కొత్త మొత్తాన్ని జమ చేస్తుంటాయి. అయితే పీఎఫ్ అకౌంట్లో జమ అయిన డబ్బును ఉద్యోగులు అప్పుడప్పుడు విత్‌డ్రా చేస్తుంటారు. అయితే విత్‌డ్రా చేయాలంటే సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి విత్‌డ్రా ప్రాసెస్..
Updated on: May 13, 2024 | 12:06 PM

EPFO

EPF

పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ యాప్ ఉమంగ్ అందుబాటులో ఉంది. ఈ ఉమంగ్ యాప్ ద్వారా కూడా ఈపీఎఫ్ సేవలు పొందవచ్చు. ఈ యాప్ ద్వారా మీ పీఎఫ్ ఖాతాలో డబ్బు ఎంత ఉందో కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. అంతే కాదండోయ్.. దీని నుంచి కూడా మీ పీఎప్ ఖాతాలో డబ్బులను డ్రా చేసుకోవచ్చు. దీనిని మీ మొబైల్ నుంచే డైరెక్ట్ గా అప్లై చేసుకునే వీలుంటుంది.

ఉమంగ్ యాప్‌లోఈపీఎఫ్ సేవలను ఎలా ఉపయోగించుకోవచ్చు చూద్దాం. ముందుగా మీ మొబైల్‌లో ఉమాంగ్ యాప్ ఓపెన్ చేయాలి. సెర్చ్ మెనుకి వెళ్లి EPFO వెబ్ సైట్లోకి వెళ్లండి. అక్కడ ‘Employee Centric’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత ‘Raise Claim’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

ఈపీఎఫ్ పాన్ నంబర్‌ను నమోదు చేయండి. రిజిస్టర్డ్ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఆ తర్వాత విత్ డ్రా చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోండి. ఆ తర్వాత Submit పై క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీ విత్‌డ్రా ప్రాసెస్ పూర్తవుతుంది. ఈ ప్రాసెస్‌లో భాగంగా క్లెయిమ్‌కు సంబంధించి రెఫరెన్స్ నంబర్ కూడా వస్తుంది. ఈ నంబర్ ద్వారా మీ క్లెయిమ్ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు.




