AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Conclave: టీవీ9 కాన్‌క్లేవ్‌లో రాజకీయ ప్రముఖులు.. ఎవరేమన్నారంటే?

అన్ని పార్టీల అగ్రనేతల విమర్శలు, ప్రతి విమర్శలతో.. TV9 కాన్‌క్లేవ్ హాట్‌హాట్‌ సాగుతోంది. తెలంగాణలో అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితి ఉందన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్, కాంగ్రెస్ అలవికాని హామీలిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే.. ఆర్థికంగా బలపడతామన్నారు.

Basha Shek
|

Updated on: Nov 23, 2023 | 6:52 PM

Share
Union Minister Kishan Reddy says youth in rural areas of Telangana are supporting BJP

1 / 9
బీఆర్ఎస్‌గా మార్చుకున్న తర్వాత.. తెలంగాణ అంటూ మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు కిషన్ రెడ్డి. గ్యారంటీలతో అభివృద్ధి జరగదని.. ప్రజలు బాగుపడరని చెప్పారు. మోదీ అభివృద్ధిని చూసి ఓటెయ్యండని కోరారు కిషన్ రెడ్డి.

2 / 9
టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్.. తెలంగాణ ఒక కుటుంబం కోసం ఏర్పాటు కాలేదన్నారు.  కేసీఆర్ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. 50ఏళ్ల పాటు ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు.

3 / 9
టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ.. కాంగ్రెస్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. గాంధీ కుటుంబంలాగా తాము నేరుగా ప్రజాజీవితంలో రాలేదన్నారు. దమ్ముంటే రాహుల్ హైదరాబాద్‌లో తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు.

4 / 9
తెలంగాణలో తొమ్మిదిన్నరేళ్లలో ఒక్కసారి కూడా అల్లర్లు జరగలేదన్నారు అసద్. కేసీఆర్ పాలనలో ఎంతో అభివృద్ది జరిగిందని.. శాంతి భద్రతలు మెరుపడ్డాయన్నారు. బీజేపీకి చెప్పుకోవడానికి ఏమీలేదని.. అందుకే రామాలయంలాంటి అంశాలు తెస్తున్నారని విమర్శించారు అసద్.

5 / 9
ఉదయం టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌.. కాంగ్రెస్ అనేది గతం.. బీఆర్ఎస్ అనేది భవిష్యత్ అన్నారు. 6నెలలకు ఒకసారి మారే  సీఎంను ప్రజలు కోరుకోరని చెప్పారు. కాంగ్రెస్ వస్తే హైదరాబాద్‌లో రియల్ ఢమాల్ అన్నారు కేటీఆర్.

6 / 9
ఇందిరమ్మ రాజ్యం అంటే.. ఆకలి రాజ్యం, గంజికేంద్రాలు,  నక్సలిజం, నిరుద్యోగం అన్నారు కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యం అట్టర్ ప్లాఫ్‌ కావడంతోనే ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారని తెలిపారు. మూడోసారి సీఎంగా కేసీఆర్ రికార్డ్ సృష్టిస్తారన్నారు కేటీఆర్.

7 / 9
టీవీ9 మెగా కాంక్లేవ్‌లో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. కేటీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పేదలకు భూములు పంచి, బ్యాంకులను జాతీయం చేసిందన్నారు. అందరికీ ఇళ్లు ఇచ్చి, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌తో పాటు ఉపాధినిచ్చిందన్నారు.

8 / 9
బీఆర్ఎస్ డిఫెన్స్‌లో పడిపోయింది.. కాంగ్రెస్‌ గెలుస్తుందని కేసీఆర్‌కు కూడా అర్థమైందన్నారు భట్టి విక్రమార్క.  కాంగ్రెస్ వస్తే అరాచకమని బీఆర్ఎస్‌ది గోబెల్స్ ప్రచారం చేస్తోందన్నారు భట్టి.

9 / 9