- Telugu News Photo Gallery Political photos CM Jagan held a face to face meeting with the pension beneficiaries on 11th day of the Memanta Siddam Bus Yatra
YSRCP: 11వ రోజు మేమంతా సిద్దం బస్సుయాత్రలో సీఎం జగన్.. పెన్షన్పై అవ్వాతాతలతో ముఖాముఖి..
వైఎస్ఆర్సీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్దం బస్సు యాత్ర 11వ రోజుకు చేరింది. వెంకటాచలం పల్లి నుంచి బయలుదేరిన బస్సుయాత్ర వినుకొండ మీదుగా గంటావారిపల్లెకు చేరుకోనుంది. వెంకటాచలంపల్లి నుంచి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ బోదనంపాడు, కురిచేడు, చింతల చెరువు, పొదిలి జంక్షన్, చీకటిగల పాలెం మీదుగా వినుకొండకు చేరుకుంది. దారిపొడవునా జగన్కు ప్రజలు స్వాగతం పలికారు.
Updated on: Apr 24, 2024 | 3:14 PM

వైఎస్ఆర్సీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్దం బస్సు యాత్ర 11వ రోజుకు చేరింది. వెంకటాచలం పల్లి నుంచి బయలుదేరిన బస్సుయాత్ర వినుకొండ మీదుగా గంటావారిపల్లెకు చేరుకోనుంది.

వెంకటాచలంపల్లి నుంచి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ బోదనంపాడు, కురిచేడు, చింతల చెరువు, పొదిలి జంక్షన్, చీకటిగల పాలెం మీదుగా వినుకొండకు చేరుకుంది. దారిపొడవునా జగన్కు ప్రజలు స్వాగతం పలికారు.

వినుకొండలో సీఎం జగన్ రోడ్ షోలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

వైఎస్ఆర్సీపీ పాలనలో తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరిస్తున్నారు. సీఎం జగన్ చింతల చెరువు గ్రామానికి చేరుకోగానే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది హాజరయ్యారు.

సాయంత్రం 6 గంటల వరకు వినుకొండలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోలో పాల్గొన్న ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. అవ్వతాతలతో మాట్లాడుతూ తన ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందాయా అని అడిగారు.

మేమంతా సిద్దం బస్సు యాత్ర 11వ రోజు పెన్షన్ పై అవ్వ,తాతలతో ముఖా ముఖి నిర్వహించారు. ఎప్రిల్ 1న వాలంటీర్లు నేరుగా మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వకపోవడానికి గల కారణాలను వివరించారు. రూ. 200 ఇచ్చే పెన్షన్ ను రూ. 3000 పెంచిన ఘనత మీ బిడ్డ ప్రభుత్వానిదే అని జగన్ వివరించారు.
