Bharath Shakthi: రాజస్థాన్ పోఖ్రాన్‌లో ‘భారత్ శక్తి’ నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ..
రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో 'భారత్ శక్తి' పరేడ్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆదివారం గొప్పగా నిర్వహించారు. ఇక్కడ భారతదేశపు త్రిదళాధిపతులు స్వదేశీ ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించారు. త్రివిధ దళాధిపతులు స్వయంగా అందులోనూ దేశీయంగా తయారు చేసిన రక్షణ పరికరాల పనితీరును ప్రదర్శించారు. సొంతంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి అలాగే ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం అని ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను ప్రధాని మోదీ చెప్పారు. గత దశాబ్దంలో దేశ రక్షణ ఉత్పత్తి రెండింతలు పెరిగిందని, ఇది రూ. 1 లక్ష కోట్లకు మించిందని అన్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
