అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'శివం భజే’. తాజాగా ఈ చిత్ర టైటిల్ ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇందులో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జై చిరంజీవ తర్వాత తెలుగులో అర్బాజ్ నటిస్తున్న సినిమా ఇదే.