- Telugu News Photo Gallery Planning for tour with Life Partner? visit this tourist places in October to earn unforgettable memories
October Tour: భాగస్వామితో టూర్ ప్లాన్ చేస్తున్నారా..? మరపురాని జ్ఞాపకాల కోసం అక్టోబర్‌లోనే ఈ ప్రాంతాలను సందర్శించండి..
October Tour: చాలా మంది చల్లని వాతావరణాల్లో సమయాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి ప్రాంతాలను భాగస్వామితో కలిసి పర్యటనకు వెళ్లి జ్ఞాపకాలను సంపాదించుకోవాలి కోరుకుంటారు. ఇందుకు అక్టోబర్ నెలలోని వాతావరణం అన్నివిధాల అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో టూర్‌కి వెళ్లాలని మీరు కూడా పర్యటనకు వెళ్లాలనుకున్నట్లయితే మన దేశంలోనే ఉన్న ఈ ప్రాంతాలను వెంటనే సందర్శించండి.
Updated on: Oct 03, 2023 | 1:11 PM

October Tour: చాలా మంది చల్లని వాతావరణాల్లో సమయాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి ప్రాంతాలను భాగస్వామితో కలిసి పర్యటనకు వెళ్లి జ్ఞాపకాలను సంపాదించుకోవాలి కోరుకుంటారు. ఇందుకు అక్టోబర్ నెలలోని వాతావరణం అన్నివిధాల అనుకూలంగా ఉంటుంది.

బిర్ బిల్లింగ్: హిమాచల్ ప్రదేశ్‌లోని బిర్ బిల్లింగ్‌ను సందర్శించడానికి అక్టోబర్ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీరు ఇక్కడ అందమైన లోయలు, దట్టమైన అడవులలో తిరుగుతూ సమయాన్ని హాయిగా గడపవచ్చు. మీకు అడ్వేంచర్ ఇష్టమైతే ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా చేయవచ్చు.

ముస్సోరీ: ఢిల్లీకి సమీపంగా ఉండే ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ హనీమూన్‌కి వెళ్లాలనుకునేవారి ఎంపికల్లో ఒకటి. భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపాలనుకునేవారు నిరభ్యంతరంగా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. ఇక్కడ మీరు కెంప్టీ ఫాల్స్, మాల్ రోడ్, గన్ హిల్ వంటి ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు.

జోధ్‌పూర్: బ్లూ సిటీగా ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ చరిత్రను తెలుసుకోవాలనుకునేవారికి గమ్యస్థానం వంటిది. ఇక్కడ మీరు చారిత్రక కట్టడాలతో పాటు ఎడారి సఫారీ, బోటింగ్ వంటి వాటితో కూడా జ్ఞాపకాలను సమకూర్చుకోవచ్చు.

పంచమర్హి: పంచమర్హి మధ్యప్రదేశ్‌లో ఉన్న చాలా అందమైన హిల్ స్టేషన్. చుట్టూ పచ్చదనంతో కూడిన ఇక్కడి అందమైన దృశ్యాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి.ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం స్వర్గం కంటే తక్కువేం కాదు. మీరు ఇక్కడ జటాశంకర్ గుహలను చూడటానికి కూడా వెళ్ళవచ్చు.




