- Telugu News Photo Gallery Parenting Tips: Do you know the behavior of uneducated children? check here is details
Parenting Tips: చదవని పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా!
తమ పిల్లలు బాగా చదవాలని, వృద్దిలోకి రావాలని కోరుకోని తల్లిదండ్రులు ఉండరు. పిల్లల భవిష్యత్తు కోసం చిన్నప్పుడు నుంచే ప్రణాళికలు వేస్తూ ఉంటారు పేరెంట్స్. కానీ కొంత మంది పిల్లలు మాత్రం అస్సలు చదవరు. చదువుపై దృష్టి పెట్టలేరు. స్కూల్ కి వెళ్లాలన్నా.. చదవాలన్నా సాకులు చెబుతూ ఉంటారు. ఈ విషయం తల్లిదండ్రులు ముందే గమనిస్తే.. వారిని మంచి దారిలోకి తీసుకు రావచ్చు. అసలు చదువులో వీక్ గా ఉండే పిల్లల్ని ఎలా గుర్తించాలో..
Updated on: Dec 17, 2023 | 1:15 PM

తమ పిల్లలు బాగా చదవాలని, వృద్దిలోకి రావాలని కోరుకోని తల్లిదండ్రులు ఉండరు. పిల్లల భవిష్యత్తు కోసం చిన్నప్పుడు నుంచే ప్రణాళికలు వేస్తూ ఉంటారు పేరెంట్స్. కానీ కొంత మంది పిల్లలు మాత్రం అస్సలు చదవరు. చదువుపై దృష్టి పెట్టలేరు. స్కూల్ కి వెళ్లాలన్నా.. చదవాలన్నా సాకులు చెబుతూ ఉంటారు. ఈ విషయం తల్లిదండ్రులు ముందే గమనిస్తే.. వారిని మంచి దారిలోకి తీసుకు రావచ్చు. అసలు చదువులో వీక్ గా ఉండే పిల్లల్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా చిన్న పిల్లలు చదువుపై అంతగా శ్రద్ధ పెట్టలేరు. ఆడుకోవడానికి ఇష్ట పడుతూ ఉంటారు. ఇలాంటి పిల్లలకు ఉండే కొద్దీ చదువుపై ఆసక్తి తగ్గి పోతుంది. దీంతో చదువులో ముందుండలేరు.

చదువుపై ఆసక్తి లేని పిల్లలు స్కూల్ కి వెళ్లడానికి అస్సలు ఇష్ట పడరు. స్కూల్ కి వెళ్లడానికి అనేక కారణాలు వెతుకుతూ ఉంటారు. ఆరోగ్యం బాగోలేదని వంకలు పెడుతూ ఉంటారు. హోం వర్క్ ను కూడా చేయరు.

చదువు అంటే ఇష్టం లేని పిల్లలు క్లాస్ రూమ్ లో వెనుక కూర్చోవడానికి ఇష్ట పడతారు. అలాగని వెనుక కూర్చున్న వాళ్లు చదవరని కాదు.. చదువుపై ఆసక్తి లేని వారిలో ఇదొక పాయింట్ గా చెప్పవచ్చు. టీచర్ వీళ్లను చూడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

చదవుపై ఆసక్తి లేని పిల్లలు ఒంటరిగా కూర్చోని చదువుకోవడానికి ఇష్ట పడుతూ ఉంటారు. చదువు కోవడానికి ఎప్పుడూ ఒకే ప్రదేశాన్ని వెతుక్కుంటారు. అందుకే పిల్లల్ని ఒంటరిగా చదవనివ్వకండి. కాబట్టి పిల్లల్ని ఎప్పుడూ పేరెంట్స్ గమనిస్తూ ఉండటం మంచిది. వారు చదువుకోడానికి ఆసక్తిని కలిగిస్తూ ఉండాలి.




