- Telugu News Photo Gallery If you take this fruit in winter, your skin will glow, check here is details
Orange for Skin: శీతా కాలంలో ఈ ఫ్రూట్ తీసుకున్నారంటే.. చర్మం మెరిసిపోతుంది అంతే!
వింటర్ సీజన్ లో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. లేదంటే ఆరోగ్య పరంగా, స్కిన్ పరంగా కూడా పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ సీజన్ లో ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాలి. ఇలా చలి కాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో ఆరెంజెస్ కూడా ఒకటి. ఆరెంజ్ తింటే ఆరోగ్య సమస్యలతో పాటు స్కిన్ సమస్యలను కూడా తగ్గించు కోవచ్చు. ఆరెంజెస్ లో శరీరానికి కావాల్సిన పోషకాలు..
Updated on: Dec 17, 2023 | 2:45 PM

వింటర్ సీజన్ లో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. లేదంటే ఆరోగ్య పరంగా, స్కిన్ పరంగా కూడా పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ సీజన్ లో ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాలి. ఇలా చలి కాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో ఆరెంజెస్ కూడా ఒకటి. ఆరెంజ్ తింటే ఆరోగ్య సమస్యలతో పాటు స్కిన్ సమస్యలను కూడా తగ్గించు కోవచ్చు. ఆరెంజెస్ లో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ పుష్కలంగా ఉంటాయి.

ఆరెంజ్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా లభిస్తాయి. శరీరంలో అన్ని భాగాలను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చర్మ సమస్యలు కూడా ఉండవు. అన్నింటికంటే ముఖ్యంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని వేగంగా పెంచుతుంది.

ఆరెంజ్ లో ఐరన్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి రక్త హీనత సమస్య ఉన్నవారు క్రమం తప్పకుండా తినడం వల్ల రక్త హీనత సమస్య నుంచి బయట పడొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు వీటిని తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

ముఖ్యంగా చర్మ సమస్యల్ని తగ్గించడంలో ఆరెంజ్ కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని హెల్దీగా ఉంచడమే కాకుండా మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ ఏర్పడకుండా చేస్తాయి. చర్మాన్ని కాంతి వంతంగా తయారు చేస్తుంది. అంతే కాకుండా తరుచుగా వీటిని తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు కూడా దరి చేరవు.

ద్రాక్ష, నిమ్మ, కివీ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.




