- Telugu News Photo Gallery How to use curry leaves for high blood pressure, check here is details in Telugu
Curry Leaves for BP: బీపీ ఎక్కువగా ఉందా.. కరివేపాకుతో ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు!
డయాబెటీస్ తర్వాత అందరూ ఎక్కువగా బాధపడే దీర్ఘకాలిక వ్యాధుల్లో బీపీ కూడా ఒకటి. బీపీనే అని ఈజీగా తీసుకోకండి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకే వస్తుంది. చాలా మంది ఇప్పుడు అధిక రక్త పోటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. బీపీ వల్ల ఎక్కువగా గుండెకు ఇబ్బంది అవుతుంది. ఈ బీపీ సమస్యను ట్యాబ్లెట్స్ తో కాకుండా నేచురల్ గా కరివేపాకుతో కూడా అదుపు చేయవచ్చు. కరివేపాకులో శరీరానికి అవసరం అయ్యే ఎన్నో రకాల పోషకాలు..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Dec 17, 2023 | 3:00 PM

డయాబెటీస్ తర్వాత అందరూ ఎక్కువగా బాధపడే దీర్ఘకాలిక వ్యాధుల్లో బీపీ కూడా ఒకటి. బీపీనే అని ఈజీగా తీసుకోకండి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకే వస్తుంది. చాలా మంది ఇప్పుడు అధిక రక్త పోటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. బీపీ వల్ల ఎక్కువగా గుండెకు ఇబ్బంది అవుతుంది. ఈ బీపీ సమస్యను ట్యాబ్లెట్స్ తో కాకుండా నేచురల్ గా కరివేపాకుతో కూడా అదుపు చేయవచ్చు.

కరివేపాకులో శరీరానికి అవసరం అయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారాల్లో ప్రతి రోజు వినియోగించడం వల్ల పలు రకాల దీర్ఘకాలిక సమస్యలను కంట్రోల్ లోకి తీసుకు రావచ్చు. మరి కరివేపాకుతో బీపీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

కరివేపాకులో పాలీ ఫెనాల్స్, ఫ్లేవ నాయిడ్స్ వంటివి అధిక మోతాదులో ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గించు కోవచ్చు. అంతేకాకుండా నరాల బలహీనత, వాపు వంటి వాటి సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. ఇవి బీపీని అదుపు చేసేందుకు సహాయ పడతాయి.

కరివేపాకులో పొటాషియం కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి తరుచుగా కరివేపాకు రసాన్ని తాగితే తక్కువ సమయంలోనే రక్త పోటు కంట్రోల్ అవుతుంది. అలాగే సోడియం ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. బాడీలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత కూడా ప్రభావితం అవుతుంది.

కరివేపాకులో అనేక పోషకాల సమ్మేళనాలు లభిస్తాయి. కరివే పాకు వాసోడైలేషన్ ను ప్రోత్సహించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా రక్త ప్రవాహాన్ని కూడా మెరుగు పరుస్తుంది. దీని వల్ల ధమని గోడలపై ఒత్తిడిని కూడా నియంత్రిస్తుంది.





























