- Telugu News Photo Gallery Cinema photos Ravi Teja to Adivi Sesh latest movie updates from film industry
Movie Updates: మాస్ మహరాజాతో క్లాస్ మహరాణి.. 2024లో రెండు సినిమాలతో అడివి శేష్..
కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చుగానీ, రావడం మాత్రం పక్కా అంటూ విద్య వాసుల అహం మూవీ టీజర్‌ని విడుదల చేశారు శివానీ రాజశేఖర్. రవితేజ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. నయనతార, విఘ్నేష్ శివన్ కలిసి ఓ కొత్త ఇంటిని కట్టుకోబోతున్నారంటూ కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. 2024లో రెండు సినిమాలను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు అడివి శేష్. క్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా తంగలాన్.
Updated on: Dec 17, 2023 | 1:23 PM

కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చుగానీ, రావడం మాత్రం పక్కా అంటూ విద్య వాసుల అహం మూవీ టీజర్‌ని విడుదల చేశారు శివానీ రాజశేఖర్. రాహుల్ విజయ్ హీరోగా నటించిన సినిమా ఇది. పెళ్లి అంటే నూరేళ్ల పంట కాదు, ఎవ్రీ మినిట్ మంట అంటూ సాగే టీజర్ యువతను ఆకట్టుకుంటోంది.

రవితేజ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన కొత్త భామ భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. మాస్ మహరాజాతో క్లాస్ మహరాణి అంటూ ఈ విషయాన్ని ప్రకటించారు మేకర్స్.

నయనతార, విఘ్నేష్ శివన్ కలిసి ఓ కొత్త ఇంటిని కట్టుకోబోతున్నారంటూ కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నయన్ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. ప్రేమ మీద, భగవంతుడి మీద నమ్మకం ఉంచమంటూ క్యాప్షన్ పెట్టారు నయన్.

2024లో రెండు సినిమాలను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు అడివి శేష్. గూఢఛారి2తో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ సినిమా చేస్తున్నట్టు తెలిపారు. తాను ఇప్పటిదాకా చేసిన ప్రయాణం అంతా తన కష్టానికి దక్కిన ఫలితమని అన్నారు శేష్. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాలను పంచుకున్నారు.

విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా తంగలాన్. ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సీరియస్‌గా డబ్బింగ్ ప్యాచ్ వర్క్ ని పూర్తి చేసినట్టు చెప్పారు విక్రమ్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో పీరియాడిక్ కథగా తెరకెక్కుతోంది తంగలాన్. జనవరిలో ఈ సినిమా విడుదల కానుంది.




